Site icon NTV Telugu

Patra Chawl land scam case: సంజయ్ రౌత్‌ జ్యుడీషియల్ కస్టడీ 14 రోజులు పొడిగింపు

Sanjay Raut

Sanjay Raut

Patra Chawl land scam case: పత్రాచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (PMLA) కోర్టు సోమవారం 14 రోజులు పొడిగించింది. సెప్టెంబర్ 5న జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు కోర్టు పొడిగించగా ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు సంజయ్ రౌత్‌ను మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు. మరో వైపు సంజయ్ రౌత్ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ విచారణకు నోచుకోలేదు. సంజయ్‌ రౌత్‌ పిటిషన్‌ను ఈ నెల 21న విచారించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. కాగా, కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఛార్జిషీట్ కాపీని సంజయ్ రౌత్‌కు అందజేశారు.

గోరేగావ్ సబర్బన్‌లోని పత్రాచాల్‌ను పునరాభివృద్ధి చేయడంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆగస్టు 1న అరెస్టు చేసింది. మొదట్లో ఈడీ కస్టడీ అనంతరం ఆగస్ట్ 8న సంజయ్‌ రౌత్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆగస్ట్ 22న ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం కోర్టు రౌత్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది. సెప్టెంబర్ 5న జ్యుడీషియల్ కస్టడీని 14 రోజుల పాటు కోర్టు పొడిగించగా.. అది నేటితో ముగిసింది. నేడు మరోసారి కస్టడీని కోర్టు పొడిగించింది.

Jacqueline Fernandez: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. విచారణకు హాజరైన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్

ఈ ఏడాది జూన్ 28న, రూ. 1,034 కోట్ల పత్రాచాల్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంజయ్ రౌత్‌కు సమన్లు ​​జారీ చేసింది. తిరిగి ఆగస్టులో పత్రా చాల్ ల్యాండ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ భార్యకు కూడా ఈడీ సమన్లు ​పంపింది.

Exit mobile version