NTV Telugu Site icon

Sania Mirza Divorce: కొన్ని నెలల క్రితమే షోయబ్ మాలిక్‌కు సానియా విడాకులు.. అనవసర చర్చలు ఆపేయండి!

Sania Mirza Divorce

Sania Mirza Divorce

Sania Mirza divorced Shoaib Malik: పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ (41) మూడో పెళ్లి చేసుకున్నాడు. పాక్ నటి సనా జావెద్‌ (30)ను షోయబ్‌ వివాహమాడాడు. పెళ్లి ఫోటోలను షోయబ్‌ శనివారం స్వయంగా తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇరు దేశాల క్రీడా వర్గాల్లో పెద్ద చర్చానీయంశమైంది. అయితే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో షోయబ్‌ విడాకులు తీసుకున్నాడా? లేదా? అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో సానియా కుటుంబం ఆదివారం స్పందించింది. కొన్ని నెలల క్రితమే షోయబ్‌, సానియా విడాకులు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఇక అనవసర చర్చలు ఆపేయండని, సానియా జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుందని పేర్కొంది.

‘సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి వెళ్లకుండా గోప్యంగా ఉంచుతుంది. అయితే క్లిష్ట పరిస్థితుల్లో స్పందించక తప్పట్లేదు. షోయబ్, సానియా విడాకులు తీసుకొని కొన్ని నెలలు అవుతోంది. షోయ‌బ్ కొత్త జీవితం బాగుండాల‌ని విష్ చేసింది. సానియా తన జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు అండగా నిలవాలి. ఆమె గోప్యతకు ఎటువంటి భంగం కలిగించకుండా గౌరవించాలి. అనవసర చర్చలు ఆపేయండి’ అని సానియా కుటుంబం ఓ ప్రకటలో పేర్కొంది.

Also Read: IND vs ENG: ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్‌ అయితే.. టీమిండియాది విరాట్ బాల్: గ‌వాస్క‌ర్

సానియా మీర్జా స్వస్థలమైన హైదరాబాద్‌లో ఏప్రిల్ 2010లో షోయబ్‌ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. అనంత‌రం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో వీరి వ‌లీమా జ‌రిగింది. కొన్నాళ్లు దుబాయ్‌లో గడిపిన ఈ జంట‌కు 2018లో ఇజాన్ పుట్టాడు. 10 ఏళ్ల పాటు వీరి బంధం బాగానే సాగింది. సానియా, షోయబ్ మధ్య సంబంధాలు చాలా కాలం క్రితమే దెబ్బతిన్నాయి. ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సానియా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘పెళ్లి, విడాకులు రెండూ కష్టమే’ అంటూ విడాకులపై హింట్‌ ఇచ్చింది. చివరకు త‌మ ప‌న్నెండేళ్ల వివాహబంధానికి ముగింపు ప‌లికారు. కుమారుడు ఇజాన్ ప్రస్తుతం సానియా వద్ద ఉంటున్నాడు.