NTV Telugu Site icon

Jagga Reddy : సీఎం కేసీఆర్‎కు లేఖ రాసిన జగ్గారెడ్డి.. పార్టీ మారుతారంటూ ప్రచారం

Jagga Reddy

Jagga Reddy

Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా విషయమేమీ కాదు ఇది రెండేళ్లుగా రాజకీయవర్గాల్లో నానుతున్న సంగతే. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న జగ్గారెడ్డి.. పార్టీ మారడానికి సరైన సమయం కోసం వేచిచూస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. ఆ సమయం వచ్చే వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు అనేది ఆ ప్రచారం సారాంశం. ఇలాంటి కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలోనే ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ఒకసారి.. ముఖ్యమంత్రిని విమర్శించి లాభం లేదని ఇటీవల వ్యాఖ్యానించి మరోసారి వివాదాలకు తెరదీశారు. అలా వ్యాఖ్యానించడం ఆంతర్యం ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా, జగ్గారెడ్డి.. సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. కానీ ఈ సారి ఆయన లేఖలో హోంగార్డుల గురించి ప్రస్తావించారు.

Read Also: Manik Rao Thackeray : తెలంగాణ కాంగ్రెస్ నేతలను టెన్షన్ పెడుతున్న మాణిక్ రావు ఠాక్రే

హోం గార్డు లను పర్మనెంట్ చేయాలనీ సీఎం కేసిఆర్ కి లేఖ రాసిన లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 16 వేల మంది హోం గార్డులు పని చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ హోం గార్డులను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే వారు ఎక్కడ విధులు నిర్వహిస్తే అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. సిఎం కేసిఆర్ చెప్పిన మాటనే గుర్తు చేస్తున్నానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశం ప్రస్తావనకి తీసుకుని వచ్చారు జగ్గారెడ్డి. పర్మనెంట్ చేస్తే వారికి అన్ని బెనిఫిట్స్ వస్తాయి.. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుందన్నారు.
హోం గార్డు లను పర్మనెంట్ చేసే విధంగా జీవో తీసుకుని రావాలని కోరుకుంటున్నానని జగ్గారెడ్డి తెలిపారు.

Show comments