NTV Telugu Site icon

Sandeep Reddy Vanga : ఆ బాలీవుడ్ యాక్టర్ కు సందీప్ మాస్ కౌంటర్.. ఇచ్చి పడేసాడుగా..

Whatsapp Image 2024 04 19 At 8.56.20 Am

Whatsapp Image 2024 04 19 At 8.56.20 Am

సెన్సషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు..అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ విజయం అందుకున్నారు.ఆ తరువాత సందీప్ తెరకెక్కించిన యానిమాల్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..సందీప్ కు తాను తీసిన రెండు సినిమాలకు విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అందుతున్నాయి.కానీ సందీప్ కు ఎక్కువగా విమర్శలే ఎదురవుతున్నాయి . తాజాగా తన సినిమాలో నటించిన వ్యక్తే సందీప్ సినిమాలో నటించినందుకు భాధపడుతున్నాని తెలియజేసాడు.దీనికి సందీప్ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ చేసిన కామెంట్స్ పై సందీప్ తీవ్రంగా మండిపడ్డాడు.బాలీవుడ్  నటుడు ఆదిల్ హుస్సేన్ సందీప్  రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాలో నటించాడు. అయితే తన కెరీర్లో ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడుతున్నట్లు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తాజాగా దీనిపై సందీప్ ఘాటుగా స్పందించాడు. తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా గురువారం (ఏప్రిల్ 18) కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.నా సినిమాతోనే మీకు పేరొచ్చింది ఆ విషయం మరిచిపోవద్దని సందీప్ అన్నారు .నువ్వు చేసిన 30 ఆర్ట్ సినిమాల వల్ల రాని పేరు ఇప్పుడు నువ్వు బాధపడే ఆ ఒక్క బ్లాక్‌బస్టర్ సినిమాతోనే వచ్చింది. నిన్ను ఆ సినిమాలో తీసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. సినిమాపై ప్యాషన్ కంటే నీకు అత్యాశ ఎక్కువని అర్థమైందని సందీప్ అన్నారు . నువ్వు ఇంకా బాధ పడకుండా ఆ సినిమాలో నీ ముఖాన్ని ఏఐ సాయంతో మార్చేస్తా. ఇప్పుడైనా కాస్త మంచిగా నవ్వు” అని సందీప్ ట్వీట్ చేసాడు .ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.