Sandeep Reddy Vanga : ఆ బాలీవుడ్ యాక్టర్ కు సందీప్ మాస్ కౌంటర్.. ఇచ్చి పడేసాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెన్సషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు..అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ విజయం అందుకున్నారు.ఆ తరువాత సందీప్ తెరకెక్కించిన యానిమాల్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..సందీప్ కు తాను తీసిన రెండు సినిమాలకు విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అందుతున్నాయి.కానీ సందీప్ కు ఎక్కువగా విమర్శలే ఎదురవుతున్నాయి . తాజాగా తన సినిమాలో నటించిన వ్యక్తే సందీప్ సినిమాలో నటించినందుకు భాధపడుతున్నాని తెలియజేసాడు.దీనికి సందీప్ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ చేసిన కామెంట్స్ పై సందీప్ తీవ్రంగా మండిపడ్డాడు.బాలీవుడ్ నటుడు ఆదిల్ హుస్సేన్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాలో నటించాడు. అయితే తన కెరీర్లో ఆ సినిమా ఎందుకు చేశానా అని బాధపడుతున్నట్లు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అన్నారు. తాజాగా దీనిపై సందీప్ ఘాటుగా స్పందించాడు. తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా గురువారం (ఏప్రిల్ 18) కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.నా సినిమాతోనే మీకు పేరొచ్చింది ఆ విషయం మరిచిపోవద్దని సందీప్ అన్నారు .నువ్వు చేసిన 30 ఆర్ట్ సినిమాల వల్ల రాని పేరు ఇప్పుడు నువ్వు బాధపడే ఆ ఒక్క బ్లాక్‌బస్టర్ సినిమాతోనే వచ్చింది. నిన్ను ఆ సినిమాలో తీసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. సినిమాపై ప్యాషన్ కంటే నీకు అత్యాశ ఎక్కువని అర్థమైందని సందీప్ అన్నారు . నువ్వు ఇంకా బాధ పడకుండా ఆ సినిమాలో నీ ముఖాన్ని ఏఐ సాయంతో మార్చేస్తా. ఇప్పుడైనా కాస్త మంచిగా నవ్వు” అని సందీప్ ట్వీట్ చేసాడు .ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
Ur 'belief' in 30 art films didn't get as much fame to u as ur 'regret' of 1 BLOCKBUSTER film did 👏https://t.co/BiJIV3UeyO
I regret casting u,knwing that ur greed is bigger than ur passion. NOW I'll save U from the shame by replacing Ur face with AI help👍 Now smile properly 🙂— Sandeep Reddy Vanga (@imvangasandeep) April 18, 2024
తాజావార్తలు
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!