Sandeep Reddy Vanga : ఒకవేళ వాళ్ళు నన్ను ఆపితే హాలీవుడ్ కి వెళ్ళిపోతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు మారుమ్రోగిపోతుంది. బాలీవుడ్ మీడియాలో సందీప్ రెడ్డి వంగా హాట్ టాపిక్ గా మారాడు.అందుకు కారణం ఆయన తెరకెక్కించిన యానిమల్ మూవీనే. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.యానిమల్ సినిమాలోని బీజీఎమ్, సీన్స్ మరియు స్క్రీన్ ప్లే అదిరిపోయాయి. అలాగే సందీప్ రెడ్డి టేకింగ్‌కు ప్రేక్షకులు ఎంతాగానో ఫిదా అయ్యారు. దాంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన యానిమల్ మూవీ లాంగ్ రన్‌లో రూ. 900 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఇటీవల ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో యానిమల్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది చూసిన ఇతర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మూవీపై, సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు చేయడం మెదలు పెట్టారు.
యానిమల్ మూవీ లో బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం ప్రోత్సహించేలా ఉన్నాయంటూ, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపిస్తోందని కామెంట్స్ చేశారు.అలా కామెంట్స్ చేసిన వారి అందరికి సందీప్ రెడ్డి వంగా గట్టిగానే సమాధానం ఇచ్చాడు.”సినిమా చూసిన ప్రేక్షకులు అని ఉంటే నేను పెద్దగా పట్టించుకునేవాన్ని కాదు. కానీ, ఇండస్ట్రీలో ఉండి అన్ని తెలిసిన పాపులర్ యాక్టర్స్ అలా అనడం చాలా బాధగా ఉంది. ఎవరైనా సరే ఇతరులను అనే ముందు వారు గతంలో ఏం చేశారో చూసుకుని అనాలి” అంటూ సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చాడు. ఈ క్రిటిక్స్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగా వార్ కొనసాగుతున్న నేపథ్యంలో సందీప్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశాడు.”ఒకవేళ వాళ్లు నన్ను ఇండియాలో ఆపితే నేను హాలీవుడ్‌కు వెళ్లిపోతా. నాకు భాషా పరిమితులు అంటూ ఏం లేవు. నేను భోజ్‌పురి, కన్నడ, మలయాళం, పంజాబీతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తాను” అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు దీనితో ఏది ఏమైనా యానిమల్ మూవీకి సీక్వెల్ యానిమల్ పార్క్‌ను తెరకెక్కించేందుకు సందీప్ సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?