NTV Telugu Site icon

Sandeep Reddy : ప్రభాస్ కే కండీషన్లు పెడుతున్న సందీప్ రెడ్డి.. అలా ఉంటేనే ఓకే

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

Sandeep Reddy : సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకే ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాను అలా తీయాలి, ఇలా తీయాలి అనే రూల్స్ ను బ్రేక్ చేసిన డైరెక్టర్. నా ఇష్టం వచ్చినట్టు తీస్తా అని కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. తీసింది మూడు సినిమాలే. అందులో ఒకటి రీమేక్. అంటే వర్జినల్ గా తీసింది రెండు సినిమాలతోనే ట్రెండ్ సెట్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ కే కండీషన్లు పెడుతున్నాడంట. ఎందుకంటే సందీప్ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నాడు. స్క్రిప్టు పనులు దాదాపు పూర్తయినట్టే తెలుస్తోంది. ప్రభాస్ మొదటిసారి ఇందులో పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ డైరెక్షన్ లో ఆరడుగల ప్రభాస్ అంటే.. ఊచకోత మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెట్టుకుంటున్నారు.

Read Also : CM Revanth Reddy : సీఎం రేవంత్ ను కలిసిన మోహన్ బాబు, దిల్ రాజు

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊర మాస్ గా ఉంటుందని సమాచారం. అవతల ఉన్నది ప్రభాస్ అయినా సరే భారీగా రూల్స్ పెట్టేస్తున్నాడు సందీప్. తన సినిమా అయిపోయే దాకా వేరే సినిమాలో నటించొద్దని చెప్పేశాడంట. పైగా లుక్ ఛేంజ్ చేయొద్దని, నిత్యం బయట కెమెరాల కంట పడొద్దని, గంపగుత్తగా కాల్షీట్లు ఇచ్చేయాలని కోరాడంట. డూప్ లేకుండా నటించాలని, ఏ సీన్ కు అయినా ఓకే అనాలని సందీప్ కండీషన్లు పెడితే.. వాటికి ప్రభాస్ కూడా ఓకే అంటున్నాడు. ఎందుకంటే సందీప్ తో సినిమా చేస్తే తన కెరీర్ కు ప్లస్ అవుతుందని రెబల్ స్టార్ భావిస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండింటి తర్వాత సందీప్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది.

Read Also : Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి కారణం అదే..