NTV Telugu Site icon

Pottel : ‘పొట్టేల్’ కచ్చితంగా కొట్టేస్తుంది.. సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెంట్!

Pottel Trailer

Pottel Trailer

Pottel : యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన చిత్రం ‘పొట్టేలు’. సాహిత్ మోత్కూరి దర్శకుడిగా… సురేష్‌కుమార్ సడేగే, నిశాంత్ నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులు ఆకట్టుకున్నాయి. పూర్తి గ్రామీణ వాతావరణంలోని సంప్రదాయాలు, నమ్మకాల సమాహారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కు మంచి బజ్ క్రియేట్ అయింది. ఒక పల్లెటూళ్ళో జరిగే కథలా, ఒక ఫ్యామిలీని ఊరంతా కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు, అలాగే పేద, ధనిక బేధం చూపిస్తూ, కథలో పొట్టేలు కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు, కొత్త పాయింట్ తో పొట్టేల్ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన రావడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో నిర్వహిస్తున్నారు.

Read Also:Off The Record : బీఆర్‌ఎస్‌ని పార్టీ ద్వితీయ శ్రేణే దెబ్బ కొట్టిందా?

ఇక తాజాగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పొట్టేల్’ మూవీని తాను చూశానని.. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన కాన్ఫిడెంట్ వ్యక్తం చేశారు. ఇలా సందీప్ రెడ్డి లాంటి టాప్ డైరెక్టర్ ‘పొట్టేల్’ సినిమాకు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, సాంకేతికంగా కూడా సినిమా చాలా బాగుంది. కొన్నేళ్లు గుర్తుండిపోయే సినిమా ఇది అని చిత్ర బృందం పేర్కొంటుంది. వినోదం, సందేశం మేళవించిన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్, ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్‌సేన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Read Also:Kishan Reddy : ప్రధానమంత్రి ఆదేశాల ఆధారంగా మేం లక్ష్యాలు నిర్దేశిస్తాం

Show comments