NTV Telugu Site icon

Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి మూవీ అల్లు అర్జున్ తో చేద్దామనుకున్నా కానీ విజయ్ తో తీశా..

Whatsapp Image 2024 01 06 At 3.29.24 Pm

Whatsapp Image 2024 01 06 At 3.29.24 Pm

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు.ఈ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అప్పటివరకు తెలుగులో ‘అర్జున్ రెడ్డి’వంటి ఒక బోల్డ్ మూవీ రాలేదు.అందుకే ఈ సినిమా విడుదల సమయంలో అనేక కాంట్రవర్సీలు జరిగాయి. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా నిలబడ్డారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కంటే ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అనుకున్నానంటూ దర్శకుడు సందీప్ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.‘అర్జున్ రెడ్డి’ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్ ని ఒక మలుపు తిప్పింది, తనను స్టార్ హీరోగా ప్రేక్షకుల ముందు నిలబెట్టింది. . అయితే ముందుగా ఈ మూవీలో శర్వానంద్ హీరోగా నటించాల్సింది. కానీ పలు కారణాల వల్ల తాను తప్పుకున్నాడు. దీంతో ఈ అవకాశం విజయ్ చేతికి వెళ్లింది. అయితే ‘అర్జున్ రెడ్డి’ కంటే ముందు తాను వేరే కథ రాసుకున్నానని సందీప్ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

ఆ కథను ముందుగా అల్లు అర్జున్ కు వినిపించాడట. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. అందుకే ఆ కథను పక్కన పెట్టి ‘అర్జున్ రెడ్డి’ కథను డెవలప్ చేశానని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా.‘అర్జున్ రెడ్డి’ కథ పూర్తయిన తర్వాత కూడా ముందుగా అల్లు అర్జున్ కే ఆ కథను వినిపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టానని సందీప్ తెలిపాడు. కానీ తనకు ఆ అవకాశం రాలేదని ఆ తర్వాత ఎంతోమంది నిర్మాతలను సంప్రదించినా.. ‘అర్జున్ రెడ్డి’ కథలో తనకు నచ్చని మార్పులు, చేర్పులు చెప్పడంతో ఫైనల్ గా తానే నిర్మాతగా మారి.. విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కించానని సందీప్ తెలిపారు.. సందీప్ నమ్మినట్టుగానే ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక అప్పట్లో అల్లు అర్జున్ తో మూవీ చేయడం మిస్ అయినా ఇప్పుడు ఆ అవకాశం దక్కిందని సందీప్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, సందీప్ కు ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్లో మూవీ ప్రారంభం కానుంది