Sandeep Reddy Vanga : యానిమల్ మూవీ పిల్లలు చూసేది కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ శుక్రవారం (డిసెంబర్ 1) యానిమల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. . అయితే ఈ సినిమా ట్రైలర్ లోనే విపరీతమైన వయోలెన్స్ ఉండటంతో ఊహించినట్లే సెన్సార్ బోర్డు కూడా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాల్సి ఉంటుంది.అయితే తన సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి మాత్రం సంతోషం వ్యక్తం చేశాడు. నిజానికి ఈ సినిమా పిల్లలు చూసేలా ఉండదని సందీప్ స్పష్టం చేసారు..
18 ఏళ్ల లోపు వారికి ఇది సూటయ్యే సినిమా కాదు. నా కొడుకు అర్జున్ అలాగే నా సోదరుడి పిల్లలు లేదంటే కజిన్స్ పిల్లలను కూడా థియేటర్లలో సినిమాకు తీసుకెళ్లను. పిల్లల కోసం కట్ చేసిన వెర్షన్ తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాను. నా కుటుంబంలో 8 నెలల నుంచి 17 ఏళ్లలోపు పిల్లలు చాలా మందే ఉన్నారు” అని సందీప్ రెడ్డి చెప్పాడు.ఇక సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపైనా స్పందించాడు. ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుందా అని ప్రశ్నించగా.. వసూళ్లు గురించి ఇప్పుడే నేను అంచనాలు వేయలేనని, అయితే సినిమా మాత్రం అందరినీ ఆలోచింపజేస్తుందని అన్నాడు. యానిమల్ మూవీలో అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించారు.అలాగే బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు.ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుండగా.. సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డైరెక్టర్ రాజమౌళి హాజరయి సినిమాను, నటినటులను అలాగే దర్శకుడిని ఎంతగానో మెచ్చుకున్నారు.
Also Read
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్‌కూ స్వేచ్ఛ ఇవ్వాలి
తాజావార్తలు
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
-
Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..