Michael : సందీప్ కిషన్ ‘మైఖేల్’ టెలివిజన్ ప్రీమియర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..సందీప్ కిషన్ ఈ ఏడాది “మైఖేల్” అనే గ్యాంగ్ స్టర్ మూవీ లో హీరో గా నటించాడు. రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి , వరుణ్ సందేశ్ మరియు గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలలో నటించారు. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది.ఈ మూవీ భారీ అంచనాలతో ఫిబ్రవరి 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయింది. ఇదిలా ఉంటే మైఖేల్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. నవంబర్ 25 న శనివారం సాయంత్రం ఆరు గంటలకు జీసినిమాలు ఛానెల్లో ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ టెలికాస్ట్ కానుంది.
రిలీజ్‌కు ముందు టీజర్ మరియు ట్రైలర్స్‌తో మైఖేల్ మూవీ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. రొటీన్ స్టోరీ కారణంగా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేదు. . మైఖేల్ మూవీ సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది కావడం గమనార్హం. ఈ సినిమా కథ విషయానికి వస్తే జైలులో పెరిగిన మైఖేల్ (సందీప్ కిషన్) ముంబాయికి ఓ లక్ష్యం కోసం వస్తాడు. ముంబాయి అండర్‌వరల్డ్ డాన్ గురునాథ్ ను (గౌతమ్ మీనన్) ఓ ఎటాక్ నుంచి రక్షించి అతడికి బాడీగార్డ్ లా మారతాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు మైఖేల్. ఆమె గురునాథ్ శత్రువు రతన్ కూతురు కావడంతో మైఖేల్ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి..మైఖేల్‌ను చంపాలని గురునాథ్ కొడుకు అమర్నాథ్ ఎందుకు ప్రయత్నించాడు అనేదే..మైఖేల్ మూవీ కథ.థియేటర్స్ లో ఆకట్టుకోని మైఖేల్ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తోందో చూడాలి.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!