PEDDI : ‘పెద్ది’లో బాలయ్య హీరోయిన్ స్పెషల్ సాంగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది‘. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం కోసం ‘గోల్డెన్ లెగ్’ సంయుక్త మీనన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Heroines as Action Stars : మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న స్టార్ హీరోయిన్స్
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
రామ్ చరణ్ సినిమాల్లో పాటలు, ముఖ్యంగా మాస్ సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘పెద్ది’ కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్ సిద్ధం చేశారని సమాచారం. ఈ మాస్ నంబర్‌లో రామ్ చరణ్ సరసన సంయుక్త మీనన్ ఆడిపాడనుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. సంయుక్త తొలిసారిగా అఖండ 2 లో బాలయ్య సరసన జాజికాయ అనే స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది. ఇప్పడు మరోసారి స్పెషల్ సాంగ్‌లో మెగా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో చరణ్ సరసన మానస వారణాసి, మృణాల్ ఠాకూర్, పూజాహెగ్డే వంటి భామల పేర్లు వినిపించాయి కానీ చివరికి సంయుక్తకు డైరెక్టర్ బుచ్చిబాబు గ్రీన్ సిగ్నల్ ఇసినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’ రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పుడు సంయుక్త మీనన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!