పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’. ఈ సినిమా జూలై 28న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో రచ్చ చేసేందుకు రెడీ అవుతుంది. దీనితో నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సముద్ర ఖని అద్భుతంగా ప్రసంగించారు.తెలుగులోనే మాట్లాడుతూ తాను చెప్పాలనుకున్న విషయాన్ని అందరికి బాగా అర్థం అయ్యేలా చెప్పారు.ఆయన మాట్లాడుతూ ఒక రోజు నేను త్రివిక్రమ్ అన్న ఇంటికి వెళ్ళాను. అప్పుడే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ మధురైలో ఒక డాన్ నుంచి వచ్చింది.నేను చేసిన సినిమా చూసి ఏడుస్తూ ఫోన్ చేశారు. ఆయన నాతో చాలా సేపు ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. దీనితో త్రివిక్రమ్ అన్న ఎవరు ఫోన్ లో అని నన్ను అడిగారు. కొన్ని రోజుల క్రితం నేను ఒక సినిమా చేశాను అన్నా ఆ మూవీ చూసి ఏడుస్తూ మధురైలో ఒక డాన్ ఫోన్ చేసి ఏడుస్తున్నారు అని నేను చెప్పాను అలాగే వయసు 70 ఆ మధ్య ఉంటాయని కూడా చెప్పాను ఆ సినిమా కథ ఏంటి అని త్రివిక్రమ్ అన్న నన్ను అడిగారు. దీనితో నేను కథ చెప్పాను. చివర్లో ఒక డైలాగ్ ను చెప్పాను. స్వర్గంలో జాతి లేదు,మతం లేదు..మరి నరకంలో అంటే అక్కడి నుంచే కదా నిన్ను తీసుకుని వస్తున్నాం అని నేను చెప్పాను. దీనితో త్రివిక్రమ్ అన్న ఒక్కసారిగా ఎంతో ఏక్సైట్ అయి మళ్ళీ చెప్పు అని అన్నారు.
ఆయనకి నేను చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. ఈ కథని ఒక పెద్ద హీరోతో చేయాలనుకుంటున్నా అని త్రివిక్రమ్ అన్నతో చెప్పాను. ఆయన పది నిమిషాల తర్వాత వచ్చి.. పవన్ కళ్యాణ్ గారితో చేస్తావా అని నన్ను అడిగారు. వెంటనే నేను ఒక్కసారిగా లేచి నుంచున్నాను.అప్పుడే నా టైం వచ్చింది అన్నట్లు అనిపించింది. అప్పటి నుంచి నా టైం.. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురుచూశా. చివరకి ఆయన నుంచి పిలుపు వచ్చింది అని సముద్రఖని గారు తెలిపారు.పవన్ కళ్యాణ్ గారితో పాత్ర షూటింగ్ నేను 21 రోజుల్లో పూర్తి చేశాను. ఈ చిత్రం కోసం ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారితో చేసిన ఈ జర్నీ లో ఆయనకు సమాజం పట్ల వున్న అవగాహన చూసాను.ఆయన వెంట నడిచేందుకు నేను ఎప్పుడూ రెడీ అని సముద్ర ఖని అన్నారు.అలాగే త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ అన్నా ఒక తండ్రిలా నన్ను ట్రీట్ చేసేవారు. నాకు అన్ని దగ్గరుండి చూసుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు. చివరిగా ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ గెలుస్తాం అంటూ భరోసా ఇచ్చి తన ప్రసంగాన్ని ముగించారు