సామ్ సంగ్ లాంచ్ ఈవెంట్ Galaxy Unpacked Event 2025 ప్రారంభమైంది. దీనిలో, కంపెనీ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిలో Galaxy Z Fold 7, Galaxy Z Flip 7, Flip 7 FE ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శామ్సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు గెలాక్సీ వాచ్ 8, గెలాక్సీ వాచ్ 8 క్లాసిక్ స్మార్ట్‌వాచ్‌లను కూడా విడుదల చేశారు. Galaxy Z Fold 7 అనేది Android 16లో సరికొత్త One UI 8తో వస్తుంది. One UI 8 అనేది ఫోల్డబుల్స్‌పై Samsung తాజా AI-ఆధారిత ప్లాట్‌ఫారమ్. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఆర్మర్ ఫ్లెక్స్ హింజ్ సన్నగా, తేలికగా ఉంటుంది. కవర్ డిస్ప్లే కార్నింగ్® గొరిల్లా® గ్లాస్ సిరామిక్ 2 తో తయారు చేశారు. ఫ్రేమ్, హింజ్ హౌసింగ్‌లోని అడ్వాన్స్‌డ్ ఆర్మర్ అల్యూమినియం ధృడంగా, కాఠిన్యాన్ని 10% పెంచుతుంది.
Also Read:K-Ryap : దీపావళికి రేస్ లోకి ‘K-ర్యాంప్’.. కిరణ్ అబ్బవరం ఫుల్ ఎనర్జీ మోడ్ ఆన్ !
Galaxy Z Flip7 12GB + 512GB, 12GB + 256GB ఎంపికలలో బ్లూ షాడో, జెట్‌బ్లాక్, కోరల్-రెడ్, మింట్ (ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్) రంగు ఎంపికలలో $1099.99 ప్రారంభ ధరకు లభిస్తుంది. Samsung Galaxy Z Flip7 FE 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్లలో నలుపు, తెలుపు రంగులలో $899 నుంచి లభిస్తుంది. ఈ ఫోన్‌లు ఈరోజు, జూలై 9 నుంచి ప్రీ-ఆర్డర్‌లకు అందుబాటులో ఉన్నాయి. జూలై 25 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.