Samsung Galaxy Watch9, Samsung Ultra2 Launched: శాంసంగ్ నుండి స్మార్ట్‌వాచ్‌లు Galaxy Watch9, Galaxy Watch Ultra2లను లాంచ్ అయ్యాయి. కొత్త తరం Snapdragon Wear Elite ప్లాట్‌ఫామ్‌తో వచ్చిన ఈ వాచ్‌లు మరింత వేగమంతమైన పనితీరు, AI ఆధారిత హెల్త్ ఫీచర్లు, ప్రకాశవంతమైన డిస్‌ప్లేలు, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో పని చేయనున్నాయి. గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 (Galaxy Watch Ultra2) వాచ్ అవుట్‌డోర్ అడ్వెంచర్‌లు, స్పోర్ట్స్ యాక్టివిటీల కోసం రూపొందించగా.. గెలాక్సీ వాచ్ 9 (Galaxy Watch9) రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణకు తగట్టుగా రూపొందించారు.
Samsung Galaxy Watch Ultra2:
ఈ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2లో అడ్వెంచర్ లవర్స్ కోసం ప్రత్యేకమైన ట్రైల్ రన్ మోడ్ (Trail Run Mode)ను అందించారు. ఇది పరుగులో ఎలివేషన్, ఎక్కిన ఎత్తు, భూభాగ ప్రభావం వంటి వివరాలను ట్రాక్ చేస్తుంది. అలాగే కొత్త Nutrition Alert ఫీచర్ ద్వారా శరీర బరువును ఆధారంగా తీసుకుని చెమట ద్వారా కోల్పోయిన నీటి పరిమాణాన్ని అంచనా వేసి, ఎంత నీరు తాగాలో సూచిస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్ IP69K, 10ATM, EN13319 సర్టిఫికేషన్లతో డైవింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. నీటి లోతు, డైవింగ్ సమయం, నీటి ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది. హార్డ్‌వేర్ పరంగా చూస్తే ఇందులో 800mAh బ్యాటరీ, గరిష్టంగా 5,000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగిన 1.52 అంగుళాల Sapphire Crystal Super AMOLED డిస్‌ప్లే, Snapdragon Wear Elite (3nm) ప్రాసెసర్, 2GB RAM + 64GB స్టోరేజ్ ఉన్నాయి.
Samsung Galaxy Watch9:
రోజువారీ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేసిన వీటిలో నిద్ర, శారీరక శ్రమ, ఫిట్‌నెస్, ఆరోగ్యానికి సంబంధించిన పలు ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. అల్యూమినియం బాడీ, శామ్‌సంగ్ కుషన్ డిజైన్‌తో తేలికగా ధరించడానికి అనువుగా ఉంటుంది. ఈ వాచ్ 40mm, 44mm సైజుల్లో ఉండగా.. 44mm మోడల్‌లో 445mAh, 40mm మోడల్‌లో 390mAh బ్యాటరీ ఉన్నాయి. గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగిన Sapphire Crystal సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, Snapdragon Wear Elite ప్రాసెసర్, 2GB RAM + 32GB స్టోరేజ్ ను కలిగి ఉంది.
AI ఆధారిత హెల్త్ ఫీచర్లు:
Galaxy Watch Ultra2, Galaxy Watch9 రెండింటిలోనూ Samsung BioActive Sensorను ఉపయోగించారు. AI సాయంతో వినియోగదారుల ఆరోగ్యాన్ని నిరంతరం విశ్లేషిస్తూ పలు కీలకమైన ఫీచర్లను అందిస్తుంది.
ముఖ్యమైన హెల్త్ ఫీచర్లు:
* Sleep Apnea Detection – నిద్రలో శ్వాస సమస్యలను AI ద్వారా గుర్తించడం.
* Vitals Monitoring – నిద్ర సమయంలో ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చే మార్పులను ట్రాక్ చేయడం.
* Heart Health Score – గుండె ఆరోగ్యానికి స్కోర్‌తో పాటు వ్యక్తిగత సూచనలు ఇవ్వడం.
* Daily Cardio Load – వ్యాయామ తీవ్రత, రికవరీకి సంబంధించిన సమాచారం.
* Fitness Index – శారీరక దృఢత్వాన్ని అంచనా వేసి వ్యక్తిగత లక్ష్యాలను సూచించడం.
* Hearing Protection – అధిక శబ్దాల ప్రభావాన్ని గుర్తించి హెచ్చరికలు ఇవ్వడం.
Galaxy Watch Ultra2 కోసం మెరైన్ బ్యాండ్, పీక్‌ఫామ్ బ్యాండ్, ట్రైల్ బ్యాండ్లను పరిచయం చేసింది. Galaxy Watch9 కోసం స్పోర్ట్స్ బ్యాండ్, మిస్టీ బ్యాండ్, ఫ్యాబ్రిక్ బ్యాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వివిధ అవసరాలకు అనుగుణంగా వీటిని మార్చుకునే అవకాశం ఉంటుంది.
Samsung Care+ సపోర్ట్:
ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లకు Samsung Care+ సేవను కూడా అందిస్తోంది. ప్రమాదవశాత్తూ డ్యామేజ్ అయినా రక్షణ, పొడిగించిన వారంటీ, సర్టిఫైడ్ సర్వీస్ సపోర్ట్ లభిస్తుంది. Galaxy స్మార్ట్‌ఫోన్‌లలోని Warranty & Care విభాగం ద్వారా వారంటీ వివరాలు, రిపేర్ రిక్వెస్ట్‌లు, రిమోట్ సపోర్ట్ వంటి సేవలను పొందవచ్చు.
ధరలు:
Galaxy Watch9, Galaxy Watch Ultra2 ప్రస్తుతం ఎంపిక చేసిన మార్కెట్లలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. సాధారణ అమ్మకాలు ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి.
* శాంసంగ్ గెలాక్సీ వాచ్ 9 (Bluetooth, 40mm) – రూ.38,999.
* శాంసంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 (47mm) – రూ.69,999.
ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులకు Galaxy Watch9పై రూ.1,000, Galaxy Watch Ultra2పై రూ.5,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా 60 రోజుల Strava ట్రయల్, 2 నెలల iFIT ట్రయల్ను కూడా ఉచితంగా అందిస్తోంది.

