Samsung Galaxy Tab: గెలాక్సీ S10 FE, S10 FE+ ట్యాబ్ లను భారత్ లో లాంచ్ చేసిన శాంసంగ్
- శాంసంగ్ గెలాక్సీ S10 FE, S10 FE+ ట్యాబ్ లను భారత్ లో లాంచ్.
- ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో
- ప్రత్యేక డిస్కౌంట్స్ కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంసంగ్ తాజాగా గెలాక్సీ ట్యాబ్ S10 FE, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ లను అధికారికంగా విడుదల చేసింది. దీనితో ఈ టాబ్లెట్‌లు భారతదేశంలో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన ఈ గెలాక్సీ ట్యాబ్ S10 FE సిరీస్ టాబ్లెట్‌లు మంచి స్పెసిఫికేషన్‌లతో వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీ-ఆర్డర్ ఆఫర్లను ఉపయోగించుకొని వీటిని మంచి తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈ ట్యాబ్ ల ప్రత్యేకతల విషయానికి వస్తే.. డిస్‌ప్లే పరంగా, గెలాక్సీ ట్యాబ్ S10 FE 10.9 అంగుళాల స్క్రీన్, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ 13.1 అంగుళాల స్క్రీన్ అందిస్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్ అందించారు. Exynos 1580 ప్రాసెసర్ ఇందులో పొందుపరిచారు. ఇక కెమెరా విషయానికి వస్తే.. రియర్ కెమెరాగా 13MP, ఫ్రంట్ కెమెరాగా 12MP అల్ట్రా-వైడ్ లు ఉన్నాయి. ఇవి వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ IP68 సర్టిఫైడ్ కలిగి ఉన్నాయి.
Also Read
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ఇక బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా.. గెలాక్సీ ట్యాబ్ S10 FE 8,000mAh, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ 10,090mAh బ్యాటరీలు కలిగి ఉండి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
గెలాక్సీ ట్యాబ్ S10 FE ధరలు:
8GB RAM + 128GB స్టోరేజ్ (Wi-Fi) – రూ.42,999
12GB RAM + 256GB స్టోరేజ్ (Wi-Fi) – రూ.53,999
8GB RAM + 128GB స్టోరేజ్ (5G) – రూ.50,999
12GB RAM + 256GB స్టోరేజ్ (5G) – రూ.61,999
గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ధరలు:
8GB RAM + 128GB స్టోరేజ్ (Wi-Fi) – రూ.55,999
12GB RAM + 256GB స్టోరేజ్ (Wi-Fi) – రూ.65,999
8GB RAM + 128GB స్టోరేజ్ (5G) – రూ.63,999
12GB RAM + 256GB స్టోరేజ్ (5G) – రూ.73,999
ఈ టాబ్లెట్‌లు శాంసంగ్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఆఫ్లైన్ రిటైల్ స్టోర్‌లలో కూడా ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ టాబ్లెట్‌లను కొనుగోలు చేయవచ్చు. ఇక వీటికి ప్రీ-బుకింగ్ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుపై (ఫుల్ పేమెంట్, EMI) తక్షణ డిస్కౌంట్ కింద గెలాక్సీ ట్యాబ్ S10 FE కు రూ.4,000, గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ట్యాబ్ కు రూ.5,000 లభిస్తుంది. గెలాక్సీ ట్యాబ్ S10 FE లేదా S10 FE+ కొనుగోలుపై రూ.3,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్ ఉంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 6 వరకు మాత్రమే ఉంటుంది.
తాజావార్తలు
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!