Site icon NTV Telugu

Samsung Galaxy M36: మిడ్ రేంజ్ బడ్జెట్‌లో సామ్ సాంగ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు

Samsung Galaxy M36

Samsung Galaxy M36

మిడ్ రేంజ్ బడ్జెట్‌లో కొత్త స్మార్ట్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. భారత్ లో Samsung Galaxy M36 లాంచ్ అయింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎంట్రీ లెవల్ మిడ్ రేంజ్ బడ్జెట్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 20 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో వస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ఉంది. ఈ ఫోన్‌లో 50MP కెమెరా, ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ఉన్నాయి.

Also Read:India Bangladesh: బంగ్లాదేశ్‌ని దారుణంగా శిక్షించిన మోడీ సర్కార్.. ఏం చేసిందంటే..

ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ చేశారు. Samsung Galaxy M36 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ డిస్కౌంట్ తర్వాత రూ.16,499 కు లభిస్తుంది. ఈ ఫోన్‌పై రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 21,999. ఈ అన్ని వేరియంట్లపై రూ. 1000 తగ్గింపు లభిస్తోంది. మీరు ఈ ఫోన్‌ను సెరీన్ గ్రీన్, వెల్వెట్ బ్లాక్, ఆరెంజ్ హేజ్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. జూన్ 12 నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Also Read:Kartik Maharaj: 6 నెలల్లో 12 సార్లు అత్యాచారం.. పద్మశ్రీ అవార్డు గ్రహీతపై ఆరోపణలు..

స్పెసిఫికేషన్లు

Samsung Galaxy M36 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+తో వస్తుంది. ఇది Exynos 1380 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM, 8GB RAM ఆప్షన్స్ తో 256GB వరకు స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ UI 7 పై పనిచేస్తుంది. ఇందులో గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్, AI సెలెక్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను పొందుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, కంపెనీ 13MP సెల్ఫీ కెమెరాను అందించింది. 5000mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Samsung Knox Vault అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version