Samsung Galaxy M35 5G Launch Date and Pice in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎం సిరీస్‌లో ‘శాంసంగ్ ఎం 35 5జీ’ను భారతదేశంలో బుధవారం లాంచ్ చేసింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండడం విశేషం. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, నథింగ్ 2ఏ, రెడ్‌మీ 13 5జీ ఫోన్‌లకు ఎం 35 5జీ గట్టి పోటీనివ్వనుంది. ఈ ఫోన్ ఫుల్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
శాంసంగ్ ఎం 35 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999గా.. 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ.21,499గా కంపెనీ నిర్ణయించింది. ఇక 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. మూన్‌లైట్ బ్లూ, డే బ్రేక్ బ్లూ, థండర్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది. శాంసంగ్ వెబ్‌సైట్, అమెజాన్ సహా ఇతర రిటైల్ స్టోర్లలో జులై 20 నుంచి ఎం 35 5జీ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అన్ని బ్యాంక్ కార్డులపై రూ.2 వేల తగ్గింపు ఉంది. రూ.1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను శాంసంగ్ అందిస్తోంది. మరోవైపు అమెజాన్ పే క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
Also Read: Gautam Gambhir: అలాంటి ఆటగాళ్లనే ఎంపిక చేస్తా: గంభీర్
శాంసంగ్ ఎం 35 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే ఉంది. 120 Hz రిఫ్రెష్ రేటు, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సహా కార్నింగ్ గొరిల్లా విక్టస్+ ప్రొటెక్షన్ ఉంది. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఫోన్ వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్ ఉంటుంది. సెల్ఫీల కోసం 13 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 25W ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.