NTV Telugu Site icon

Samsung Galaxy A06 Launch: ‘శాంసంగ్‌’ నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Samsung Galaxy A06 Launch

Samsung Galaxy A06 Launch

Samsung Galaxy A06 Specifications Leaked Ahead Of Launch in India: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ ‘శాంసంగ్‌’ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లకు కూడా రిలీజ్ చేస్తోంది. ఇటీవలి కాలంలో ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేసిన శాంసంగ్‌.. ఎంట్రీ లెవల్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ06’ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. గత ఏడాది నవంబర్‌లో లాంచ్ అయిన గెలాక్సీ ఏ05కి కొనసాగింపుగా వస్తోంది. ఎం సిరీస్‌లో భాగంగా తాజాగా ‘ఎం35’ 5జీని శాంసంగ్‌ తీసుకొచ్చింది.

నివేదికల ప్రకారం… శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. మీడియాటెక్ హెలియో జీ85 ప్రాసెసర్ ఉండనుంది. 120 Hz రీఫ్రెష్‌ రేటు, 720 x 1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతం. వెనక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్‌పై రన్ అవుతుంది.

Also Read: Poco M6 Plus 5g Price: పోకో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో సూపర్ కెమెరా, భారీ బ్యాటరీ!

శాంసంగ్ గెలాక్సీ ఏ06 ఫోన్‌ 15 వాట్స్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని తెలుస్తోంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్లె ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇందులో 6జీబీ ర్యామ్ ఉండనుంది. 3 కలర్ ఆప్షన్‌లో గెలాక్సీ ఏ06 ఫోన్ వస్తుందని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.18 వేలు ఉండే అవకాశం ఉంది. త్వరలోనే గెలాక్సీ ఏ06 లాంచ్ కానుంది. ఫుల్ డీటెయిల్స్ అప్పుడు తెలియరానున్నాయి.