NTV Telugu Site icon

Samsung Smartphone: శాంసంగ్‌ సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. 280 ఎంపీ కెమెరా, 7600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ!

Samsung A56 Launch

Samsung A56 Launch

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ ‘శాంసంగ్‌’ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. బడ్జెట్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఏ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చినా జనాలు ఎగబడి కొంటున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి మరో సూపర్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘శాంసంగ్‌ ఏ56’ పేరుతో ప్రీమియం ఫోన్‌ను తీసుకొస్తోంది.

శాంసంగ్‌ ఏ56 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే గ్లోబల్‌ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్‌లోకి కంపెనీ లాంచ్‌ చేయనుంది. ఈ ఫోన్‌ లాంచ్‌కు ముందే ఫీచర్లకు సంబంధించిన డీటెయిల్స్ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 1080 x 2340 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ రానుంది. శాంసంగ్‌ ఏ56లో కెమెరా, బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారట.

Also Read: Team India: నాకు ఆడాలని అస్సలు లేదు.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న టీమిండియా కీపర్!

శాంసంగ్‌ ఏ56లో ఏకంగా 280 మెగా పిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను ఇస్తున్నారట. సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 62 ఎంపీ కెమెరాను ఇవ్వనున్నారు. ప్రైమరీ కెమెరాతో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను కూడా చిత్రీకరించవచ్చు. తక్కువ లైటింగ్ కండిషన్స్‌లో కూడా క్లారిటీగా ఫొటోలు వస్తాయట. ఇందులో ఏకంగా 7600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారని తెలుస్తోంది. ఫోన్‌ను 8జీబీ+256జీబీ స్టోరేజ్‌తో దీనిని తీసుకురానున్నారని తెలుస్తోంది. అయితే ధరకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు.

Show comments