NTV Telugu Site icon

Samsung A35 5G: మార్కెట్ లోకి వచ్చేసిన శాంసంగ్ కొత్త మొబైల్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

Smsnga35

Smsnga35

శాంసంగ్ మొబైల్స్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. కంపెనీ నుంచి వస్తున్న ప్రతి ఫోన్ కు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. తాజాగా వచ్చిన మరో ఫోన్ మార్కెట్ లోకి వచ్చేసింది.. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ స్వయంగా తయారు చేసే ఎక్సినోస్ 1380 ప్రాసెసర్పై పని చేయనుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్ ఫోన్… ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కానుంది. ఏకంగా నాలుగు జనరేషన్ల పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్స్, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ను అందించనున్నట్లు శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే అందించారు.. అలాగే కెమెరా విషయానికొస్తే.. వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ను సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రధాన కెమెరాగా ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లను కెమెరా సెటప్లో చూడవచ్చు. ముందువైపు 13 మెగాపిక్సెల్ లెన్స్ ద్వారా సెల్ఫీలు తీసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు..

ధర విషయానికొస్తే.. రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గానూ నిర్ణయించారు… ఇక ఈ ఫోన్లు మార్కెట్ లోకి మరో మూడు రోజుల్లో రానున్నాయి.. ఫ్రీ సేల్స్ అప్పుడే ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..