NTV Telugu Site icon

Samsung 110 Inch TV: శాంసంగ్‌ నుంచి 110 ఇంచెస్ టీవీ.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

Samsung 110 Inch Microled Smart 4k Tv

Samsung 110 Inch Microled Smart 4k Tv

Samsung 110 Inch MicroLED Smart 4K TV Launch in India with Rs 1.14 Crore: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ సంస్థ ‘శాంసంగ్‌’కు భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. శాంసంగ్‌ నిత్యం సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను, టీవీలను రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. ఇటీవల భారత మార్కెట్‌లో Z సిరీస్, M సిరీస్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన శాంసంగ్‌.. తాజాగా లగ్జరీ టీవీని లాంచ్‌ చేసింది. 55, 65, 70, 80 కాకుండా.. ఏకంగా 110 ఇంచెస్ 4కే డిస్‌ప్లేతో సరికొత్త టీవీని తీసుకొచ్చింది. M1 AI ప్రాసెసర్‌తో ఈ టీవీని తయారుచేసినట్లు కంపెనీ పేర్కొంది. సఫైర్‌ గ్లాస్‌తో స్క్రీన్‌, డాల్బీ అట్మాస్‌, మొబైల్ మిర్రరింగ్, వైఫై కనెక్టివిటీ వంటి ఎన్నో ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయని శాంసంగ్ వెల్లడించింది.

Samsung 110 Inch TV Price:
110 ఇంచెస్ స్క్రీన్‌తో వస్తున్న ఈ శాంసంగ్‌ టీవీ ధర కోటి పైనే ఉంది. భారత మార్కెట్‌లో ఈ టీవీ ధర రూ.1,14,99,000గా కంపెనీ నిర్ణయించింది. ఈ మైక్రోఎల్‌ఈడీ టీవీ (MicroLED TV) ఈ వారం నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. మైక్రోలెడ్ టెక్నాలజీ అంటే.. మైక్రో ఎల్‌ఈడీ, మైక్రో కాంట్రాస్ట్, మైక్రో కలర్, మైక్రో హెచ్‌డీఆర్ మరియు మైక్రో ఏఐ ప్రాసెసర్‌. ఇవన్నీ అంతిమ, హై-ఎండ్ పిక్చర్ అనుభవాన్ని అందించడానికి సమన్వయంతో పనిచేస్తాయని శామ్‌సంగ్ తెలిపింది.

Samsung 110 Inch TV Features:
శాంసంగ్‌ 110 ఇంచెస్ టీవీలో మైక్రో ఎల్‌ఈడీ 4కే డిస్‌ప్లేతో వస్తుంది. సఫైర్‌ గ్లాస్‌తో తయారు చేసిన 24.8 మిలియన్‌ మైక్రో ఎల్‌ఈడీలు ఇందులో ఉన్నాయి. దీంతో శక్తిమంతమైన రంగులను సైతం కంటికి చాలా అందంగా మార్చగలదు. మైక్రో హెచ్‌డీఆర్‌, మల్టీ ఇంటెలిజెన్స్ AI అప్‌స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్‌పాన్షన్ ప్లస్ వంటి ఫీచర్లు ఈ టీవీలో ఉంటాయి.

Also Read: Sania Mirza-Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌‌ విడాకులు కన్ఫార్మ్.. ఒక్క పోస్ట్‌తో..!

Samsung 110 Inch TV Display:
మినిమలిస్టిక్ మోనోలిత్ డిజైన్‌తో శాంసంగ్‌ 110 ఇంచెస్ టీవీ వస్తుంది. ఇందులో ప్రత్యేకంగా అమర్చిన ఆర్ట్‌ మోడ్‌, యాంబియంట్‌ మోడ్‌+ సాయంతో టీవీని ఆర్ట్‌ డిస్‌ప్లే వాల్‌గా మార్చుకోవచ్చు. మెరుగైన ఆడియో కోసం 100W RMS సౌండ్‌ సిస్టంను అమర్చారు.

Samsung 110 Inch TV SolarCell Remote:
శాంసంగ్‌ 110 ఇంచెస్ టీవీకి సోలార్‌ సెల్ రిమోట్‌ ఇచ్చారు. ఇది మినిమలిస్టిక్ కీలతో సొగసైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ రిమోట్‌ను రన్ చేయడానికి బ్యాటరీలు అవసరం లేదు. ఇండోర్ లైటింగ్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. శాంసంగ్‌ వెబ్‌సైట్స్, ఇతర రిటైల్‌ స్టోర్లలో ఈ టీవీని కొనుగోలు చేయొచ్చు.

Also Read: Amaranth Health Benefits: షుగర్ పేషేంట్స్ తప్పనిసరిగా తినాల్సిన తృణధాన్యం ఇదే.. సూపర్బ్ రిసల్ట్!

 

Show comments