Site icon NTV Telugu

Sampath Nandi: టాలీవుడ్ దర్శకుడి ఇంట తీవ్ర విషాదం..

Director Sampath Nandi's Father,

Director Sampath Nandi's Father,

టాలీవుడ్‌లో విభిన్న సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సంపత్ నంది. తాజాగా, ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నంది కిష్టయ్య, అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. తెలుగులో సంపత్ నందికి దర్శకుడిగా మంచి పేరుంది. ఆయన చివరిగా దర్శకత్వ పర్యవేక్షణలో ఓదెల 2 (ఓదెల సెకండ్ పార్ట్) రిలీజ్ చేశారు. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇక, ప్రస్తుతం ఆయన శర్వానంద్ హీరోగా ‘భోగి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. మరోపక్క, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు.

Also Read : Prasanth Varma: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం? – IFFI స్టేట్‌మెంట్‌పై పెద్ద చర్చ

ఇక, ఆయన బిజీబిజీగా ఉన్న తరుణంలో ఆయన తండ్రి కన్నుమూయడం ఒకరకంగా విషాదకరమైన విషయం అనే చెప్పాలి. సంపత్ నంది ఫార్మసీ చదివినా, సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చేశారు. పోసాని కృష్ణమురళి దగ్గర రైటర్‌గా కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఆయన కొన్ని యాడ్ ఫిలిమ్స్‌కి కూడా డైరెక్టర్‌గా వ్యవహరించారు. తర్వాత, పూర్తిస్థాయి దర్శకుడిగా మారి తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఇక, సంపత్ నంది తండ్రి అంత్యక్రియల వివరాలైతే తెలియరాలేదు. బహుశా, వారి స్వగ్రామంలో జరిగే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు వెల్లడించారు.

Exit mobile version