NTV Telugu Site icon

Samantha Counter : చెవుల్లో వెంట్రుకలు ఎలా పెంచాలో గూగుల్లో సెర్చ్ చేసిన సమంత

New Project (10)

New Project (10)

Samantha Counter : సమంత కెరీర్ ముగిసిపోయిందని.. ‘పుష్ప’ సినిమాలో ఐటెం డ్యాన్స్ చేసిందంటూ నిర్మాత చిట్టిబాబు చేసిన ఆరోపణ భారీ చర్చలకు దారి తీసింది. ఇప్పుడు చిట్టిబాబు ఆరోపణలకు సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ద్వారా సమంత నిర్మాతకు గట్టి సమాధానమే ఇచ్చింది. చెవి వెంట్రుకలను ఎలా పెంచాలనే దానిపై Googleలో సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది.

Read Also: Gun Fire: పెళ్లి కాస్త లొల్లి అయింది.. కాల్పుల్లో బీజేపీ నేత కుమారుడి మృతి

‘ప్రజలు తమ చెవుల్లో జుట్టును ఎలా పెంచుతారు’ అని సమంత గూగుల్ లో సెర్చ్ చేసింది. చెవిలో వెంట్రుకలు పెరగడానికి కారణం టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగడమే అని గూగుల్ సమాధానం ఇస్తుంది. సమంత స్క్రీన్‌షాట్‌కి ‘#IYKYK’ (ఇఫ్‌ యు నో యు నో) అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘శాకుంతలం’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో సమంతపై చిట్టిబాబు తీవ్ర విమర్శలు చేశారు. “సినిమా ప్రమోషన్ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. ఆమె విడాకుల తర్వాత, జీవనోపాధి కోసం పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసింది. స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. హీరోయిన్ గా నటిగా కెరీర్ ముగిసింది. శాకుంతలం చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయాను. హీరోయిన్ అనే బిరుదు కోల్పోయిన సమంతకు శకుంతల పాత్ర ఎలా వచ్చిందో గుర్తొచ్చి ఆశ్చర్యం వేస్తుంది.

Read Also: Instagram : ఇన్ స్టాలో ఇంటికి రమ్మన్నాడు.. వాడుకుని వీడియో తీశాడు

వారు స్టార్‌డమ్‌కి తిరిగి రాలేరు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నారు. యశోద సినిమా ప్రమోషన్‌లో ఆమె ఏడుస్తూ అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. శాకుంతలం ప్రమోషన్ కోసం కూడా అలాగే చేశారు. గొంతులోంచి మాట బయటికి రావట్లేదని.. మాట్లాడలేకపోతున్నామని చెప్పి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. భావాలు అన్ని సమయాలలో పనిచేయవు. సినిమా, పాత్ర బాగుంటే జనాలు చూస్తారు. “సమంత ఇప్పుడు చేస్తున్నది చీప్ అండ్ క్రేజీ” అని చిట్టిబాబు చెప్పారు.

Show comments