NTV Telugu Site icon

Samantha: రేటు పెంచిన సమంత.. అన్ని కోట్లిస్తేనే చేస్తా అంటున్న బ్యూటీ

Samantha

Samantha

Samantha: ‘ఏమాయ చేశావే’ సినిమాతో తెరంగేట్రం చేసి అబ్బాయిలు తన మాయలో పడేసుకుంది సమంత. తనదైన నటన, గ్లామర్ తో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. హీరో నాగ చైతన్యను వివాహం చేసుకుని.. కపుల్ అంటే వీళ్లేరా అనిపించుకున్నారు. కానీ విబేధాల కారణంగా నాలుగేళ్ల తర్వాత విడిపోయి అభిమానులకు షాకిచ్చారు. తర్వాత తేరుకుని సమంత తన దృష్టి కెరీర్ పైనే పెట్టారు. ప్రస్తుతం ఆమె సినిమాల విషయంలో దూకుడు పెంచారు.

Read Also: Jabardasth Varsha : ఆస్పత్రిలో చేరిన వర్ష.. ఆందోళనలో జబర్దస్త్ టీం

సమంత ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియండెట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ కోవలోనే సమంత ప్రధాన పాత్రలో టైటిల్ రోల్ పోషిస్తూ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘శాకుంతలం’. నీలిమా గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ఇక తెలుగు ప్రాజెక్టుల్లో సమంత నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చేనెల 21న యశోద విడుదల కానుంది. దీపావళి పండగ పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ వదిలారు. అలాగే.. ఈ మూవీ ట్రైలర్ అక్టోబర్ 27న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి తెలుగులో ‘ఖుషి’ సినిమా చేస్తోంది.

Read Also: Virat Kohli Records: ఒకే దెబ్బకు కోహ్లీ ఐదు రికార్డులు.. రాహుల్ ద్రవిడ్ వెనక్కు

ఆమె ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారు. ఇది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. అయితే వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిన సమంత రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందని టాక్. సమంత తన సినిమాలకు దాదాపు రూ.3-8 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. సమంత ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్, డికెల దర్శకత్వం వస్తున్న ఈ లేటెస్ట్ వెబ్ సిరీస్‌లో సమంత, హిందీ యువ నటుడు వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్‌కు ఇండియన్ వెర్షన్ అంటున్నారు. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్, డికెలతో సమంత చేస్తున్న రెండవ ప్రాజెక్ట్ ఇది.

Show comments