Site icon NTV Telugu

Samantha : గతంలో నేను తప్పులు చేసిన మాట వాస్తవమే.. సమంత..

Samantha Copy

Samantha Copy

Samantha : సమంత.. ఈ అందాల బొమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ తో కలిసి చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను ఖుషి సినిమాతో పలకరించిన ఆవిడ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలలో కనపడలేదు. ఖుషి సినిమా యావరేజ్ టాక్ రావడంతో ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉందని మాట వినపడుతోంది. ఇక టాలీవుడ్ లేదా దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమల్లో అయితే కేవలం ఫిమేల్ సెంట్రిక్ కథలు మాత్రమే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఒకవేళ అది కుదరకపోతే కేవలం పాన్ ఇండియా సినిమాలకు కోసం మాత్రమే ఎదురు చూస్తుందట.

Gun Hulchul: అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం.. ఇద్దరు అరెస్ట్..!
రెండు సంవత్సరాల క్రితం సమంత మాయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. సంవత్స కాలం పాటు అందుకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకొని ఆవిడ బయటపడింది. అలా తిరిగి వచ్చాక.. ఖుషి సినిమాను పూర్తి చేసి సినిమా అనంతరం కొద్దిగా కాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చింది. అయితే ఇది కేవలం తన మానసిక ప్రశాంతత కోసం బ్రేక్ ఇచ్చినట్లు టాక్. ఇప్పుడు మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ షూటింగుకు రెడీ అయిపోయింది. ఈ మధ్యనే సంత నిర్మాతగా మారిన సంగతి కూడా తెలిసిందే. మారి ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టి బంగారం అనే మూవీని కూడా అనౌన్స్ చేసింది. ఇందులో సమంతనే లీడర్ చేయబోతోంది. ఇక ఇదంతా ఒకవైపు ఉంటే.. మరోవైపు ఈ బ్యూటీ ఆల్కేష్ సహోత్రితో కలిసి టేక్ 20 అనే పేరుతో పాడ్ కాస్ట్ రిలీజ్ చేస్తోంది. ఇందులో ఆమె ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ ను పంచుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ఆవిడ దీని ద్వారా ప్రమోట్ చేస్తోంది.

SCO summit: కజకిస్తాన్ ఎస్‌సీఓ సమ్మిట్‌కి మోడీ బదులుగా జై శంకర్..

అయితే ఇందులో భాగంగా.. సమంత చెబుతున్న ఆరోగ్యకరమైన టిప్స్ ను ఉద్దేశించి ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా బానే చెబుతున్నారు.. కాకపోతే., గతంలో మీరు అనారోగ్యకమైన బ్రాండ్స్ ను ప్రమోట్ చేశారు కదా.. అందుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించాడు. దీనిపై సమంత రియాక్ట్ అయింది. ఇదివరకు తాను చేసిన తప్పులు వాస్తవమేనని.. అయితే అది పూర్తిగా తెలియక చేసినవని మాత్రమే అంటూ సమంతా తెలివింది. వాటి విషయాలు తర్వాత అన్నింటిని పూర్తిగా ఆపేశానని ఇప్పుడు తాను ఏవైతే ఆచరిస్తున్నానో అవి మాత్రమే చెబుతున్నట్లు ఆవిడ పేర్కొంది. అయితే ఆవిడ చెబుతున్న ఆరోగ్య సూచనలు చాలామంది ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం ఈ మధ్య చాలామంది ప్రజలలో హెల్త్ కాన్సిస్ ఎక్కువైపోయింది కాబట్టి.

Exit mobile version