IMDb యొక్క గత దశాబ్దంలో వీక్షించబడిన టాప్ 100 భారతీయ తారల జాబితాలో 13వ ర్యాంకింగ్ ను పాన్ ఇండియన్ స్టార్ ‘సమంతా రూత్ ప్రభు’ సాధించింది. ఆమె తప్ప ఆ లిస్ట్ లో మరెవరూ లేరు. దక్షిణాది నుండి టాప్ 15లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నటి ఆమె. ఆమె దక్షిణ భారతదేశ చలనచిత్ర ప్రదర్శనల నుండి ఉత్తరాన నిర్మించిన ‘ఫ్యామిలీ మేన్’ లోని రాజి పాత్ర వరకు మరెన్నో వరకు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ‘పుష్ప’ కోసం ప్రత్యేక పాటలో ఆమె నటన ఆమె అద్భుతమైన ప్రశంసలను అందుకుంది. ఆ పాట దశాబ్దపు అతిపెద్ద హైలైట్ లలో ఒకటిగా నిలిచింది. జనవరి 2014 నుండి ఏప్రిల్ 2024 వరకు IMDb ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.
Ap Police: ఏపీలో గత ఎన్నికలతో పోలీస్తే ఈ సారి భారీగా పట్టుబడ్డ మద్యం, డ్రగ్స్, సొమ్ము
ఈ ర్యాంకులను ఐఎండిబి ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్స్ ఎక్కువ నెలవారి సందర్శకుల వీక్షణలను ఆధారంగా తీసుకుంటాయి. ఇలాంటి పెద్ద ఈవెంట్లో దక్షిణ భారతదేశం నుండి ఏకైక మహిళగా సమంత నిలిచి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ… ఇందుకు సహకరించిన దర్శకులు, రచయితలు, అలాగే నిర్మాతలు అందరి కృషి.. వారి నమ్మకం వల్ల తాను ప్రేక్షకుల ప్రేమ, విశ్వాసం పొందానని తెలపంది. ప్రేక్షకులందరికీ ఈ గౌరవానికి తనకు అర్హురాలును చేసినందుకు ధన్యవాదాలు అంటూ తెలిపింది.
Lucky Bhaskar: పవన్ కళ్యాణ్ తో పోటీకి దిగిన దుల్కర్ సల్మాన్
ఇకపోతే సమంత సినీ పరిశ్రమలో ప్రయాణం అంత సులువుగా లేదు. ఆమె ప్రతిభ, కష్టానికి నిదర్శనంగా ఆవిడ పలు అవార్డులను అందుకుంటూ దక్షిణ భారతదేశంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పింది. ఇక ఆమె ఈ దశబ్ద కాలంలో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్యతో వివాహం, ఆ తర్వాత విడాకులకు సంబంధించిన విషయాలు కూడా ఆమెకు ఈ ర్యాంక్ సాధించడంలో దోహదపడ్డాయని చెప్పవచ్చు.