Site icon NTV Telugu

Samantha Marriage: 3 రోజులకే శుభవార్త.. సమంత పెళ్లిపై.. బాలీవుడ్ నటుడు సెన్సేషనల్ కామెంట్స్!

సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుల పెళ్లి వార్త నెట్టింట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎంత సీక్రెట్‌గా ఉంచారంటే, ఏకంగా పెళ్లి ఫోటోలు వచ్చే వరకు ఇండస్ట్రీలో ఎవరికీ అనుమానం రానివ్వలేదు. అయితే తాజాగా సమంతతో కలిసి ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఈ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Also Read : Tollywood 2025: స్టార్ పవర్ ఉన్నా కంటెంట్ లేకపోతే కష్టమే.. 2025 టాలీవుడ్ నేర్పిన పాఠం!

గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ.. “నేను ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో భాగంగా సమంతతో కలిసే ఉన్నాను. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన సరిగ్గా మూడు రోజులకే వాళ్లిద్దరి పెళ్లి ఫోటోలు చూసి నోరెళ్లబెట్టాను. రాజ్‌తో నాకు పాత పరిచయం ఉన్నా, సమంతతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నా.. కనీసం నాకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అంత సీక్రెట్‌గా పెళ్లి కానిచ్చేశారు” అంటూ చెప్పుకొచ్చారు. 2025 డిసెంబర్ 1న ఈషా ఫౌండేషన్‌లో యోగ సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ ఒక్కటైన సంగతి తెలిసిందే.

ఇక గుల్షన్ దేవయ్య కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ‘కాంతార చాప్టర్ 1’లో ప్రిన్స్ కులశేఖర పాత్రతో మెప్పించిన ఆయన, ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ గ్యాప్‌లో జరిగిన ఈ పెళ్లి ముచ్చట్లు ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version