Site icon NTV Telugu

Samantha : జిమ్ లో తెగ కష్టపడుతున్న సమంత..

Whatsapp Image 2023 08 11 At 11.38.39 Pm

Whatsapp Image 2023 08 11 At 11.38.39 Pm

సమంత గత నెలలో తాను సినిమాలకు కొద్దిగా బ్రేక్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను చేయాల్సిన `ఖుషి`, `సిటాడెల్‌` షూటింగ్‌లు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవ లో, మానసికంగా ప్రశాంతం గా ఉండే ప్రదేశాల్లో విహరిస్తుంది.. తనకు నచ్చిన జీవితాన్ని అనుభవిస్తుంది. తన అనారోగ్యం నుంచి బయటపడేందుకు మరింత స్ట్రాంగ్‌ అయ్యేందుకు రెడీ అవుతుంది.అలాగే తన పెట్స్ తో టైమ్‌ స్పెండ్‌ చేస్తూ చిల్ అవుతుంది. యోగాసనాలు చేస్తూ, జిమ్‌ లో శ్రమిస్తూ తన ఫిట్‌నెస్‌ ని కూడా పెంచుకుంటుంది.తాజాగా సోషల్ మీడియా లో ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ పెట్టింది సమంత. తన క్యూట్‌ పిక్‌ని షేర్‌ చేసింది.దీంతో పాటు తన నెయిల్‌ పెయింటింగ్స్ ని కూడా చూపించింది. మరోవైపు జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను కూడా ఇందులో షేర్‌ చేసుకుంది సమంత. వీటితో పాటు తన పెట్స్, బుక్స్ వంటివి ఆమె పోస్ట్ చేసింది.

ఆమె షేర్ చేసిన పిక్స్ లో గ్లాసెస్‌ ధరించి  ఎంతో క్యూట్ గా కనిపించింది.. ఈ పిక్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. మరోవైపు ఈ భామ ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చింది. మనం చేయాల్సిన పనుల గురించి ఆమె ఒక కొటేషన్ ను కూడా షేర్‌ చేసింది.నీ పర్పస్.. ప్రపంచం  అప్రూవర్‌ పొందడం కాదు, కానీ అది ప్రపంచం ముందు వెలుగొందాలని, అలాగే మనకోసం మనం కష్టపడాలని, నచ్చింది చేయాలని ఆమె తెలిపింది.ప్రస్తుతం ఈ పోస్ట్ లు సోషల్ మీడియా లో తెగ వైరల్‌ అవుతున్నాయి.ప్రస్తుతం సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన `ఖుషి` చిత్రం విడుదలకు సిద్ధం అయింది.. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ఆద్యాంతం ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది.. ఇందులో సమంత ఆరాధ్యగా ఎంతో సందడి చేసింది.ఈ సినిమా సెప్టెంబర్‌ 1 న ప్రపంచ వ్యాప్తం గా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.

Exit mobile version