Site icon NTV Telugu

Samantha: సమంత నాటకాలాడుతోంది.. మళ్లీ ట్రోలింగ్ మొదలు..?

Sam

Sam

Samantha: సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరికి ట్రోల్ చేయడం అలవాటు అయిపోయింది. ఊరు, పేరు తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడొచ్చు.. ఎవరిని పడితే వారిని కామెంట్స్ చేయొచ్చు అని ట్రోలర్స్ వీర్రవీగిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్సే వారి టార్గెట్. చిన్న డ్రెస్ వేసుకొంటే ట్రోల్ .. వేరొక హీరోతో కనిపిస్తే ట్రోల్స్, భర్తకు విడాకులు ఇస్తే ట్రోల్.. ఒకటని లేదు.. వారు ఏది చేసినా మంచి చేదు మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు ట్రోల్ చేయడమే వారికి పని. ఇక ట్రోలర్స్ వలన ఎంతో ఇబ్బంది పడినా.. పడుతున్న హీరోయిన్స్ లో మొదటి స్థానంలో ఉంది సమంత. ఆమె గురించి న్యూస్ రావడం ఆలస్యం ట్రోలర్స్ రెడీ గా ఉంటారు. సాధారణ సమయంలో ఎన్ని ట్రోల్స్ చేసినా పర్లేదు కానీ ఆమె ఆరోగ్యం బాలేనప్పుడు కూడా ఇలా ట్రోల్ చేసి నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు.

అసలు విషయం ఏంటంటే..సమంత గత కొంత కాలంగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. చర్మానికి సంబంధించిన ఈ వ్యాధి చాలా అరుదైనది అని, దీనికి చికిత్స లేదని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక మూడు నెలల నుంచి సామ్.. ఆ వ్యాధితో పోరాటం చేస్తోంది. చికిత్స తీసుకుంటూ, ఇంటివద్ద రెస్ట్ తీసుకుంటూ తన స్ట్రెంత్ ను పెంచుకుంటుంది. ఇక ఆ సమయంలో కూడా ఆమె యశోద సినిమా కోసం పనిచేసింది. తనను నమ్మి సినిమా తీస్తున్న నిర్మాతలకు నష్టం కలిగించకూడదని ఆమె హాస్పిటల్ బెడ్ పైనే యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పింది. ఆ సినిమా కోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బాధను చెప్పుకొచ్చింది. అప్పుడు సామ్ వ్యాఖ్యలు ఇప్పటికి ట్రెండింగ్ లో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఎదురు ఆమె ఆ వ్యాధి గురించి చెప్పుకొస్తుంటే ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. ఇక ఆ తరువాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిన సామ్ శాకుంతలం సినిమా కోసం మళ్లీ మీడియా ముందుకు వచ్చింది. అరుదైన వ్యాధితో పోరాటం చేస్తుండడంతో ఆమె ముఖంలో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక శాకుంతలం ట్రైలర్ లాంచ్ లో కూడా సామ్ కన్నీరు పెట్టుకుంది. తనకు దైర్యం రావడానికి అభిమానుల ప్రేమే కారణమని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు సైతం తాము ఎప్పుడు సామ్ వెంట ఉంటామని దైర్యం చెప్పుకొచ్చారు.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నా సమంత ఏడుపు పై కూడా ట్రోలర్స్ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. సమంత నాటకాలాడుతోంది అని, సినిమా హిట్ అవ్వాలని కావాలనే మీడియా ముందు ఏడ్చి సానుభూతిని క్రియేట్ చేస్తుందని సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. యశోద సమయంలో ఆమె ఏడ్చిన వీడియో హిట్ అవ్వడంతో.. ఆమె మీద సానుభూతితో యశోద సినిమాకు వెళ్లి అభిమానులు హిట్ చేసారు. ఇప్పుడు అదే స్ట్రాటజీని సామ్ మళ్లీ ప్లే చేస్తోందని, ఎందుకు అన్ని డ్రామాలు, కన్నీళ్లు, సినిమా బావుంటే వస్తారు అంటూ ట్రోలర్స్ చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ కు సామ్ ఏనాడు భయపడలేదు.. ఆమె బాధ నిజం, అది ఆమె కళ్లలో కనిపిస్తోంది. ఎవరు ఎన్ని అనుకున్నా.. ఎంత ట్రోల్ చేసినా సామ్ ను వెనక్కి నెట్టేవారు లేరు.. ఆమెకు పోటీగా నిలబడేవారు లేరు అని సామ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version