టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తుంపు తెచ్చుకుంది.. స్టార్ హీరోల సరసన నటించి బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒకప్పుడు సమంత జిమ్‌లో వంద కేజీల బరువు ఎత్తుతూ వర్కౌట్లు చేసింది. అయితే అంత ఫిట్ నెస్‌తో ఉన్న సమంత మయోసైటిస్‌తో బాధపడింది.. ఒక ఏడాది పాటు ఎటువంటి పనులు చేసుకోలేక నరకం చూసింది.. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది.. తాజాగా భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆ భయంకరమైన వ్యాధి నుంచి బయటపడటం కోసం సామ్ ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది… చివరకు ఏడాది పాటు అజ్ఞాతంలో ఉంది.. ఆ తర్వాత మెల్లగా కోలుకున్న సామ్ ఇప్పుడు బిజీగా ఉంది.. బ్యాక్ టు బ్యాక్ టు ఫోటోలను సోషల్ మీడియాలో వదులుతుంది. గ్లామరస్ డోస్ ను కూడా పెంచేసింది.. తాజాగా సమంత తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ చూస్తే.. ఇక యాక్షన్‌కు రెడీ అయినట్టుగా అర్థం అవుతోంది..
ఆ వీడియోలో సమంత వర్కౌట్స్, కిక్స్ చూస్తే మాములుగా లేవని తెలుస్తుంది.. సమంతను ఇలా చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదేం ట్రాన్స్‌ఫర్మేషన్ రా బాబు అని షాక్ అవుతున్నారు.. సెట్స్ మీద విజ్రూంభిస్తుందని కొందరు కామెంట్ చెయ్యగా, మరికొందరు మాత్రం సామ్ ఇక సినిమాలకు రెడీ అవుతుందని, ఫ్యాన్స్ రెడీ అవండి అంటూ కామెంట్లతో నింపేస్తున్నారు.. ఆ వీడియో పై మీరు ఒక లుక్ వేసుకోండి..
Queen 👑 Samantha 🥵@Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu𓃵#SamanthaRuthPrabhu pic.twitter.com/o7VThEhXwQ
— 𝐓𝐍 𝐒𝐚𝐦𝐚𝐧𝐭𝐡𝐚 𝐅𝐚𝐧𝐬 (@TN_SamanthaFans) May 21, 2024