NTV Telugu Site icon

Kissik Song: శ్రీలీల.. చంపేశావ్ పో: సమంత

Samantha Sreeleela

Samantha Sreeleela

‘పుష్ప – ది రైజ్‌’ చిత్రంలో మాదిరిగానే సెకండ్ పార్ట్‌లోనూ డైరెక్టర్ సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడు. ‘ఊ అంటావా’ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ సమంత చిందేయగా.. కిస్సిక్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో యంగ్ బ్యూటీ శ్రీలీల స్టెప్పులేసింది. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రిలీజ్ అయిన 18 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ రాబట్టి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వ్యూస్‌తో సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్‌గా కిస్సిక్ రికార్డు క్రియేట్ చేసింది.

ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్‌గా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలోని ‘విజిల్ పోడు’ టాప్-1గా కొనసాగుతుంది. ఈ సాంగ్ 24 గంటల్లో 24. 88 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ రికార్డును అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసింది మన కిస్సిక్. కేవలం తెలుగు లిరికల్ సాంగ్ వ్యూస్‌తో ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఇక ఈ పాటలో శ్రీలీల డ్యాన్స్ మామూలుగా ఉండదని.. లిరికల్ సాంగ్‌తో తేలిపోయింది. ఏకంగా బన్నీని సైతం డామినేట్ చేసినట్టుగా చర్చించుకుంటున్నారు. సమంత కంటే శ్రీలీలనే కుమ్మేసిందనే టాక్ కూడా నడుస్తోంది.

ఈ కిస్సిక్ సాంగ్ పై సమంత స్పందించింది. కస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌తో సెగలు పుట్టించిందని పేర్కొన్నారు. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో మూడు ఫైర్ ఎమోజీలు పెడుతూ.. శ్రీలీల చంపేశావ్‌ అని షేర్ చేసింది. అంతేకాదు ‘సైలెంట్‌గా ఉండండి.. పుష్ప 2 కోసం వెయిట్ చేయండి’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. మరి కిస్సిక్ ఫుల్ వీడియో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం శ్రీలీల డ్యాన్స్‌ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ఎంతలా దుమ్ము లేపుతుందో చూడాలి మరి.

Show comments