పాన్ ఇండియన్ స్టార్ సమంత ఐటెం సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ పాట ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.విడుదలయినప్పటి నుండి ఇప్పటికీ కూడా ప్రపంచం లో ఏదో మూలన ఈ పాట వినిపిస్తూనే ఉన్నది.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉంది.. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసేలా చేస్తోంది.దేవీ శ్రీ ప్రసాద్ ఆ పాటకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.. ఇప్పటికీ ఫారెన్ పబ్బుల్లో మోత మోగిస్తోంది ఈ పాట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ పెర్ఫార్మన్స్ పాటు ఈ ఐటెం సాంగ్ కూడా అందరికీ కనెక్ట్ అయిపోయింది. ఇక తాజాగా సెర్బియా, బెల్ గ్రేడ్‌లోని ఓ పబ్బులో కూడా ఈ సాంగ్ ప్లే అయి.. అందర్నీ కూడా డాన్స్ వేసేలా చేసింది. దాంతో పాటు సమంత వరుణ్ దావన్ కూడా డ్యాన్స్ చేస్తూ కనిపించడం ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.
వరుణ్ దావన్ సమంతల లేటెస్ట్ సిరీస్ సిటాడెల్ షూట్ సెర్బియా బెల్ గ్రేడ్లో అయితే జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే సరదాగా ఓ పబ్బు కు వెళ్లి డ్యాన్స్ చేస్తున్న ఈ సిరీస్ టీంకు.. సడెన్‌గా… ఊ అంటావా మామ సాంగ్ ప్లే అవడంతో.. ఒక్కసారిగా షాకయ్యారటా.. ఆవెంటనే రెచ్చిపోయి మరీ పట్టరాని ఆనందంతో డ్యాన్స్ చేశారని తెలుస్తుంది.. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. సమంత చేసిన పబ్ డ్యాన్స్ అందరికీ తెగ నచ్చేసింది..సిటడెల్ షూటింగ్‌లో కూడా సమంత స్టెప్పులతో అదరగొట్టారు. సమంత నటిస్తోన్న వెబ్ సిరీస్ సిటడెల్ షూటింగ్ సెర్బియాలో అయితే జరుగుతోంది. ఈ షూటింగ్ విరామ సమయంలో పబ్‌కు వెళ్తే అక్కడ కూడా ఈ పాటకు డ్యాన్స్ వేయాలంటూ తెగ కేకలు వేశారు. దీంతో సమంత డాన్స్ ఇరగదీసింది.