Site icon NTV Telugu

సమంత సంచలన నిర్ణయం.. చైతూ-సామ్ మళ్లీ కలవబోతున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కొన్ని నెలల కిందట విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో గతేడాది ప్రకటించి సమంత, నాగచైతన్య ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశారు. తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించబోమని వెల్లడిస్తూ అభిమానులకు షాకిచ్చారు. ఈ విషయం సినీ అభిమానులందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇప్పుడిప్పుడే నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకుల విషయాన్ని మరిచిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టారని అందరూ భావిస్తున్నారు.

Read Also: ‘అఖండ’తో ‘రాజకుమారుడు’… స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

అయితే తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల ప్రకటన పోస్టును తొలగించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అభిమానుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సామ్‌ ఎందుకు దాన్ని డిలీట్‌ చేసింది? వీళ్లిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే వీళ్లకు కలిసిపోయే ఉద్దేశం ఉంటే చైతూ కూడా ఆ పోస్ట్‌ డిలీట్‌ చేయాలి కదా.. కానీ అలా జరగలేదు. చైతూ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో విడాకుల ప్రకటన తాలుకూ పెట్టిన పోస్ట్ అలాగే ఉంది. కాగా సమంత పొరపాటునో లేదా అవసరం లేదని భావించి ఆ పోస్టును డిలీట్ చేసి ఉండొచ్చని పలువురు నెటిజన్‌లు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version