Samantha Ruth Prabhu : మళ్లీ పేరు మార్చుకోనున్న సమంత ఇకపై అలానే పిలవాలట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, బాలీవుడ్ సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గత ఏడాది డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుండి ఈ జంట పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా సమంత తన పేరుకు సంబంధించి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
సమంత తన ఇంటి పేరును మరోసారి మార్చుకోబోతుంది. సాధారణంగా పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం చూస్తూనే ఉంటాం. గతంలో అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత సమంత తన పేరును ‘సమంత అక్కినేని’గా మార్చుకుంది సమంత. అయితే, విడాకుల తర్వాత మళ్లీ ‘సమంత రూత్ ప్రభు’గా పెట్టుకుంది. ఇప్పుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సామ్, తన భర్త ఇంటి పేరును తన పేరు చివర చేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె తన పేరును సమంత నిడిమోరుగా మార్చుకుంది. సమంత ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా మరియు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ఆమె పేరును సమంత నిడిమోరుగా ప్రదర్శించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ద్వారానే తన కొత్త పేరును ప్రపంచానికి పరిచయం చేయాలని సమంత భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భర్త మీద ఉన్న ప్రేమతో పేరు మార్చుకుంటున్న సమంత నిర్ణయంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
-
Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
-
Harappa Facts: ‘ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?’ అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
-
Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..