Samantha New House: ఎప్పటి నుంచో తాను కంటున్న కలను నెరవేర్చుకుంది సమంత. హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. తన కోరిక ఇప్పటికి నెరవేరింది. చాలా మంది హీరోలు, హీరోయిన్లు దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంతమైన విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం ఆ వార్త మీడియా సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లో జయభేరి ఆరెంజ్ కౌంటీలో ఖరీదైన ఫ్లాట్ తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అపార్ట్‌మెంట్‌లోని 13వ అంతస్తులో సమంత ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. ఇది 3 bhk ఫ్లాట్ అని తెలుస్తోంది. ఈ ఇంటి ఇంటీరియర్ పనులు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ ఇల్లు రెడీ చేసినట్లు తెలుస్తోంది.
Read Also: AP Polycet: రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
సమంత కొనుగోలు చేసిన ఇంట్లో ఆరు పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. ఈ ఇంటి కోసం సమంత 7 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టింది. లగ్జరీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా సకల సౌకర్యాలతో ఈ ఇంటిని డిజైన్ చేసింది సమంత. సమంత ఇల్లు చాలా లావిష్ గా ఉండనుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా జీవిస్తోంది. అయితే ఇప్పుడు తను కొన్న ఈ ఇంటి పనులు పూర్తికావడంతో త్వరలో ఈ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తోంది. సమంత రీసెంట్‌గా శకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన సమంత నటిస్తోంది. దర్శక ద్వయం రాజ్, డీకే సిటాడెల్ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. ప్రైజ్ ఒరిజినల్ సిరీస్‌గా భారీ బడ్జెట్‌తో సిటాడెల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించి సమంత లుక్ వైరల్‌గా మారింది. దీంతో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సమంత ఖుషీ సినిమా చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా చాలా గ్రాండ్‌గా రూపొందుతోంది.
Read Also:TS EAMCET: నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు.. ఈ సారి కొత్త రూల్స్
