SP Manifesto: 5 రూపాయలకే భోజనం, మహిళలకు ఏటా రూ.40 వేలు.. ఎస్పీ మేనిఫెస్టోలో భారీ హామీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్ 26, 2026న సమాజ్‌వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. రిటైర్డ్ బ్యూరోక్రాట్ల ప్రత్యేక బృందం రూపొందించిన ఈ మేనిఫెస్టోలో సామాజిక న్యాయం, విద్య, వైద్యం, రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారు. సామాజిక న్యాయం, సంక్షేమంలో భాగంగా రాష్ట్రంలో కులగణన నిర్వహిస్తామని, పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.
రూ.50 కోట్ల వరకు ఉండే ప్రభుత్వ కాంట్రాక్టులలో దళితులు, పీడీఏ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. పేదలు, మహిళల కోసం 5 రూపాయలకే భోజనం అందించే ‘సమాజ్‌వాదీ క్యాంటీన్లు’, వృద్ధ మహిళా కళాకారులకు ఏటా రూ.40,000 ఆర్థిక సాయం లేదా పెన్షన్ అందిస్తారు. అలాగే ఉద్యోగుల కోసం పాత పెన్షన్ విధానాన్ని (OPS) తిరిగి అమలు చేయడంతో పాటు, యశ్ భారతి పురస్కారాన్ని అధిక నగదుతో పునరుద్ధరిస్తారు.
Also Read
విద్యా రంగంలో జీఎస్డీపీలో 6 శాతం నిధులు కేటాయించడంతో పాటు, మూతపడిన 26 వేల ప్రాథమిక పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు మళ్లీ ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తారు. శిక్షా మిత్రల గౌరవ వేతనాన్ని నెలకు రూ.5,000 పెంచి, వారిని క్రమబద్ధీకరిస్తారు. విద్యా శాఖలోని ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేసి, ప్రైవేట్ పాఠశాలల్లోని రిజర్వ్డ్ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది.
వైద్య రంగంలో ‘రాష్ట్ర ఆరోగ్య విధానం-2027’ తీసుకువచ్చి, పేదలకు ఉచిత వైద్యం అందిస్తారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా, అన్ని 18 డివిజన్లలో మరియు గ్రామీణ ప్రాంతాల్లో 5 కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తారు. ఇక రైతుల కోసం రుణమాఫీ, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడంతో పాటు, చెరుకు రైతుల బకాయిల చెల్లింపునకు రూ.15,000 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి 24 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూస్తారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఏఐ (AI) సాంకేతికతను వినియోగించడంతో పాటు మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
SP Manifesto: 5 రూపాయలకే భోజనం, మహిళలకు ఏటా రూ.40 వేలు.. ఎస్పీ మేనిఫెస్టోలో భారీ హామీలు..
-
ENE Repeat : ఫస్ట్ వీక్‌లోనే ‘ఈ నగరానికి ఏమైంది 2’ బ్రేక్ ఈవెన్
-
CJP: సీజేపీకి బిగ్ షాక్.. దీప్కే, దాస్, రాంకాలకు లుకౌట్ నోటీసులు!
-
Lenin : జపాన్’లో అక్కినేని ‘లెనిన్’
-
Tirumala: శ్రీవారికి వర్ధమాన్ జైన్ దంపతులు అందించిన బంగారు ఆభరణాల వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!