టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’ సినిమా తన కెరీర్ లో నే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.గత నెలలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది.ఈ సినిమాను సుమారు రూ.7 కోట్ల రూపాయల తో తెరకెక్కించ గా ఈ సినిమా రూ.50 కోట్లకు పై గా కలెక్షన్స్ సాధించింది.. రామ్అబ్బరాజు ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.ఈ సినిమా తో క్యూట్ భామ రెబా మోనికా జాన్ హీరోయిన్ గా పరిచయం అయింది.. ఈ భామ తన నటన తో ఎంతగానో మెప్పించింది.ఈ మూవీలో నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు వెన్నెల కిషోర్ రాజీవ్ కనకాల ముఖ్య పాత్ర ల్లో నటించారు.సామజవరగమన సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర సమర్పించగా రాజేశ్ దండా నిర్మాతగా వ్యవహారించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ అద్భుత సంగీతం అందించారు.
ఈ సినిమాలో సీనియర్ హీరో నరేష్ కామెడీ టైమింగ్ ఎంతగానో అలరించింది.థియేటర్ల లో విడుదలై అద్భుత విజయం సాధించిన ఈ సినిమా అనుకున్న డేట్ కంటే ముందే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.ఈ సినిమాను జూలై 28న ఆహా లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది.. కానీ జూలై 27 రాత్రి 07 గంటల నుంచి ఆహా ఓటీటీలో విడుదల చేసారు.. మీకు నవ్వుల పండుగ కాస్త ముందుగానే మెుదలవుతుంది. చల్లని వాతావరణంలో వెచ్చగా ఆహా లో సామజవరగమన చూస్తూ ఎంజాయ్ చేద్దాం అంటూ ఆహా ట్వీట్ చేసింది. జూన్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్యూర్ కామెడీతో భారీ హిట్ సాధించింది. ఈ సినిమాని ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు.థియేటర్ లో రికార్డు కలెక్షన్స్ సాధించిన సామజవరగమన సినిమా ఓటీటీ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.