NTV Telugu Site icon

Salman Khan : ఆ సౌత్ స్టార్ డైరెక్టర్ తో కొత్త సినిమా ప్రకటించిన సల్మాన్ ఖాన్..

Whatsapp Image 2024 03 12 At 5.08.31 Pm

Whatsapp Image 2024 03 12 At 5.08.31 Pm

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 చిత్రం గతేడాది నవంబర్‌లో విడుదలై మోస్తరు విజయం అందుకుంది.కత్రీనా కైఫ్ హీరోయిన్‍గా నటించిన ఆ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు.అలాగే, టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రంలో షారూఖ్ ఖాన్‍తో కలిసి సల్మాన్ కూడా నటించనున్నారు. అయితే, ఈ తరుణంలో తన తదుపరి మూవీని సల్మాన్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‍తో ఆయన సినిమా చేయనున్నారు.సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‍లో రానున్న ఈ చిత్రానికి సాజిద్ నడియడ్‍వాలా నిర్మాతగా వ్యహరించనున్నారు. సాజిద్ నిర్మాణంలో సల్లూ భాయ్ కిక్ మరియు జుడ్వా సహా మరిన్ని మూవీస్ చేశారు. ఆయన దర్శకత్వంలో కిక్ మూవీలోనూ నటించారు. ఇప్పుడు మరోసారి ఆయన బ్యానర్‌లో సినిమా చేయనున్నారు. ఈ కొత్త సినిమా గురించి సల్మాన్ ఖాన్ నేడు (మార్చి 12) ట్వీట్ చేశారు.”

అద్భుత టాలెంట్ ఉన్న ఏఆర్ మురుగదాస్ మరియు నా స్నేహితుడు సాజిద్ నడియడ్‍వాలాతో ఓ ఎగ్జైటింగ్ సినిమా కోసం కలిసి పని చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం చాలా ప్రత్యేకమైనది. మీ ప్రేమ, ఆశీర్వాదంతో ఈ జర్నీ కోసం నేను వేచిచూస్తున్నా” అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.2025 ఈద్‍కు ఈ చిత్రం రిలీజ్ అవుతుందని సల్మాన్ ఖాన్ తెలిపారు. తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్.. ఆమిర్ ఖాన్‍తో గజినీ హిందీ రీమేక్ తర్వాత బాలీవుడ్‍లో కూడా బాగా ఫేమస్ అయ్యారు. గజినీ మూవీ బాలీవుడ్‍లోనూ భారీ బ్లాక్‍ బస్టర్ అయింది. ఆ తర్వాత మరో రెండు హిందీ చిత్రాలు కూడా చేశారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‍తో భారీ మూవీ చేయనున్నారు.సల్మాన్ ఖాన్ , ఏఆర్ మురుగదాస్ కాంబోలో ఈ చిత్రం భారీ బడ్జెట్‍తో రూపొందనుందని తెలుస్తోంది. ఇండియాలోని కొన్ని లొకేషన్లతో పాటు పోర్చుగల్ మరియు యూరోపియన్ దేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందని పింక్‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‍తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది తెరకెక్కుతుందని తెలుస్తోంది.