NTV Telugu Site icon

Salman Khan: సిద్ధిక్ హత్యకు ముందే సల్మాన్‌ను చంపాలని స్కెచ్‌!

Salman

Salman

Salman Khan: దాదాపు రెండు నెలల క్రితం బాబా సిద్ధిక్‌ను షూటర్లు కాల్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిక్‌ను చంపడానికి ముందు సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేయడానికి ప్లాన్‌ చేశారని తెలిసింది. బాబా సిద్ధిక్ హత్యకేసుకు సంబంధించి విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. బాబా సిద్ధిక్‌ను 2024 అక్టోబర్ 12న ముగ్గురు దుండగులు ముంబైలో కాల్చిచంపారు. వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు 66 ఏళ్లు. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుమారుడు జీషాన్ కార్యాలయం సమీపంలో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో సిద్ధిక్‌పై దుండగులు కాల్పులు జరిపారు. విచారణ సందర్భంగా, నిందితులు సల్మాన్ ఖాన్ షూటర్ల హిట్ లిస్ట్‌లో ఉన్నారని, అయితే నటుడి గట్టి భద్రతా ఏర్పాట్ల కారణంగా వారు అతనిని చేరుకోలేకపోయారని పలు వర్గాలు తెలిపాయి.

Read Also: Syria: ఉక్రెయిన్‌ తర్వాత సిరియాలో భీకరపోరు సాగిస్తున్న రష్యా సైన్యం

ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అర్థరాత్రి కాల్పులు జరిపారు. ముష్కరులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను గుజరాత్‌లో అరెస్టు చేశారు. తరువాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ఘటనకు బాధ్యత వహించింది.గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్ పదేపదే బెదిరింపులకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్‌తో విభేదాలే కాకుండా గ్యాంగ్‌స్టర్ పేరుతో సల్మాన్ ఖాన్‌ను బెదిరింపులకు గురిచేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకునే వ్యక్తి గత నెలలో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులకు పాల్పడ్డాడు. సల్మాన్‌ఖాన్‌ను ఆలయాన్ని సందర్శించి కృష్ణజింకను చంపినందుకు క్షమాపణ చెప్పాలని లేదా రూ. 5 కోట్లు చెల్లించాలని కోరారు. అక్టోబర్‌లో జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల విక్రయదారుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించి, రూ. 5 కోట్లు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు అరెస్టయ్యాడు. కొద్ది రోజుల తర్వాత, నటుడికి గుర్తు తెలియని వ్యక్తి నుండి తాజాగా హత్య బెదిరింపు వచ్చింది. ఆ వ్యక్తి రూ. 2 కోట్లు డిమాండ్ చేశాడు.సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు కాల్‌కు సంబంధించి నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడిని కూడా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పెరుగుతున్న ఈ బెదిరింపులకు ప్రతిస్పందనగా, సల్మాన్ ఖాన్‌కు Y+ భద్రత కల్పించబడింది. సల్మాన్ నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముంబై పోలీసులు భద్రతను మెరుగుపరచడానికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన ఏఐ- పవర్డ్, హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

Show comments