Site icon NTV Telugu

Mahesh Babu: హిందీ బిగ్‌బాస్‌లో మహేష్ బాబు టాపిక్.. సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే?

Mahesh Babu Salman Khan

Mahesh Babu Salman Khan

హిందీలో బిగ్‌బాస్‌ సీజన్ 18 నడుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రియాల్టీ షోలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ సోదరి శిల్ప శిరోద్కర్‌ పాల్గొన్నారు. తాజా ఎపిసోడ్‌లో సల్మాన్, శిల్ప మధ్య సంభాషణ సందర్భంగా మధ్యలో మహేష్ టాపిక్ వచ్చింది. పబ్లిక్‌గా కనిపించేటప్పుడు మహేష్ చాలా సింపుల్‌గా ఉంటాడని కండల వీరుడు ప్రశంసించారు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బిగ్‌బాస్‌ తాజా ఎపిసోడ్‌లో శిల్పా శిరోద్కర్‌.. హౌస్‌లోని ఒకరితో అమర్యాదగా ప్రవర్తించారు. దురుసుగా కూడా మాట్లాడారు. ఈ విషయంపై శిల్పాతో హోస్ట్‌ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మర్యాద గురించి, సింప్లిసిటీ గురించి మహేష్ బాబుని ఉదాహరణగా చెప్పారు. ‘శిల్పా బావ మహేష్ బాబు సినిమాల్లో విభిన్నంగా కనిపిస్తారు. ఏ పాత్ర అయినా చేస్తారు. స్క్రీన్‌పై చాలా డిఫరెంట్. స్క్రీన్‌పై యాటిట్యూడ్ చూపిస్తారు కానీ.. నిజ జీవితంలో మాత్రం సాదాసీదా వ్యక్తి. మహేష్ సింపుల్ అండ్ ఫ్యామిలీ మ్యాన్’ అని సల్మాన్ చెప్పారు. మహేష్ గురించి చెబుతూ.. శిల్పానుఅలా ఉండాలని సూచించారు.

Also Read: Nikhil Movie: 20 రోజులకే.. ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా!

బిగ్‌బాస్‌లో మహేష్ బాబును పొగిడినందుకు సల్మాన్ ఖాన్‌పై సూపర్ స్టార్ ఫాన్స్ ప్రశంసలు కురిపించారు. సల్మాన్ కామెంట్స్ నెట్టింట వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సినిమాతో మహేష్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ కథతో ఇది రూపొందనుంది. ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ మేకోవర్ అవుతున్న అవుతున్నారు.

Exit mobile version