Site icon NTV Telugu

Salman Khan: ఇదేం ఫ్యాషన్ భాయ్? సల్మాన్ ఖాన్ ఖరీదైన బూట్ల చెరిగినట్లు ఉన్నాయే!

Salman Khan

Salman Khan

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్టైల్ ఎప్పుడూ స్పెషల్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఆయన ధరించిన ఒక బూట్ల జత ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చూడటానికి రంగు వెలిసిపోయి, చిరిగినట్లుగా కనిపిస్తున్న ఈ బూట్ల అసలు ధర తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ వాటి ధర ఎంతో తెలుసా.. సల్మాన్ ఖాన్ ధరించిన ఈ బూట్లు ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ ‘బాలెన్సియాగా’ కు చెందినవంట. ఇవి ప్రత్యేకంగా డిజైన్ చేసిన లెదర్ కౌబాయ్ షూస్ అని సమాచారం.

READ ALSO: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం.. మారనున్న ఆ రైల్వే స్టేషన్ రూపురేఖలు..

ఈ బూట్ల ధర మార్కెట్లో సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుందని సమాచారం. కావాలనే చిరిగినట్లుగా, పాతబడినట్లుగా కనిపించేలా వీటిని డిజైన్ చేయడం ఈ బ్రాండ్ ప్రత్యేకతని చెబుతున్నారు. ఈ షూస్ ఫోటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. “చిరిగిన బూట్లకే లక్షన్నర రూపాయలా?” అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, “డబ్బులు ఎక్కువైతే ఇలాంటి వింత ఫ్యాషన్లే పుట్టుకొస్తాయి” అని మరికొందరు నెట్టింట సెటైర్లు వేస్తున్నారు. నిజానికి సల్మాన్ భాయ్ సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతారని ఆయన అభిమానులు చెబుతుంటారు. కానీ ఆయన వాడే చిన్న వస్తువు కూడా ఇంత ఖరీదైనది అని తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు.

READ ALSO: Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

Exit mobile version