Tiger 3 Movie Twitter Review: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా ‘టైగర్ 3’. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కండల వీరుడు సరసన కత్రినా కైఫ్ నటించారు. సల్మాన్, కత్రినాల కాంబోలో ఒకప్పుడు వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘టైగర్ జిందా హై’కు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు (నవంబర్ 12) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే పలు చోట్ల టైగర్ 3 ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. టైగర్ 3 సినిమాకి ఎక్స్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది సినిమా బాగుందని ట్వీట్స్ చేస్తుంటే.. మరికొంతమంది బాగోలేదని కామెంట్స్ చేస్తున్నారు. టైగర్ 3ని పఠాన్, జవాన్ చిత్రాలతో పోలుస్తూ.. ఆ స్థాయిలో లేదని అంటున్నారు.
Also Read: Diwali Shubh Muhurat 2023: లక్ష్మీదేవిని పూజించే శుభ సమయం ఇదే.. విశేష ఫలితాలు మీ సొంతం!
‘టైగర్ 3 రోరింగ్ బ్లాక్ బస్టర్. జేమ్స్ బాండ్, బౌర్న్ చిత్రాల తరహాలో ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ప్యాక్ట్ మూవీగా మనీష్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. స్పై థ్రిల్లర్ చిత్రాలకు బాస్‌గా ఉంది. సల్మాన్‌కు మంచి కమ్ బ్యాక్ మూవీ. ఇమ్రాన్ హష్మీ విలనిజం, కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టారు. స్పై యూనివర్స్‌లో బెస్ట్ సినిమా’ అని నెటిజన్ కామెంట్ చేశాడు. ‘టైగర్ 3 డిస్పపాయింట్ చేసింది. సల్మాన్ ఖాన్ నీరసంగా కనిపించాడు. షారుక్ సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాడు. కానీ ఈ సినిమా సాగదీసినట్టుగా ఉంది. కత్రినా చక్కగా నటించింది అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
#Tiger3 ~ 🐯 ROARING BLOCKBUSTER 🔥 Maneesh Sharma’s BOND meets BOURNE is Action packed cracker heavy on emotions & higher stakes. Daddy of all Spy – SALMAN KHAN’s Grand comeback 💪Peak villainism of @emraanhashmi 💯 & sizzling Katrina 🔥 Best film of Spy Universe. (4.5☆/5) pic.twitter.com/Qb6WO0y01o
— Prince Prithvi (@PrincePrithvi) November 11, 2023
#Tiger3Review : Disappointing #SalmanKhan seems lethargic and trying too hard. The aura is missing and the screen presence looks animated#SRK lifts the movie on his entry but the movie drags again after his cameo. Katrina Kaif plays her part#Tiger3 will wrap under 250 cr. pic.twitter.com/Q4gEUr7nI3
— Pratham (@JainnSaab) November 11, 2023
OneWordReview…#Tiger3 : BLOCKBUSTER.
Rating: ⭐️⭐️⭐️⭐️½
Tiger is a WINNER and more than lives up to the humongous hype… #ManeeshSharma immerses us into the world of Mass Spy film,delivers a KING-SIZED ENTERTAINER A MUST WATCH #Tiger3Review #SalmanKhan #HappyDiwali… pic.twitter.com/uDLdoaHu9s— 𝐆𝐲𝐚𝐧𝐞𝐧𝐝𝐫𝐚 𝐬𝐢𝐧𝐠𝐡 (@Gyan84s) November 12, 2023
#Tiger3 Routine plot that goes overboard at times saved by terrific making. Emotions works to an extend. SRK – Salman sequence worth though it gives over the top feels. Ends with a banger from Kabir 🔥 Watch out for Katrina and her perfo👌 Sallu 👏👏 • #Tiger3Review
DWIALII 🏆 pic.twitter.com/kDN79L4G33
— Akhil Das (@thanatos__x4) November 11, 2023