Site icon NTV Telugu

SalamAir: ఒమన్ వెళ్లే భారతీయులకు షాక్.. అక్టోబర్ 1 నుంచి ..

Air Lines

Air Lines

ఒమన్ వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్. ఇప్పుడు ఒమన్ కు వెళ్లడం మన దేశ పౌరులకు ప్రియం కానున్నట్లు తెలుస్తోంది.  ఒమాన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్‌ అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో ఒమన్ నుంచి భారత్ కు, ఇక్కడి నుంచి ఒమన్ కు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బంది కలగనుంది. ఇప్పటి వరకు సలామ్ ఎయిర్ లైన్ బడ్జెట్ రేటులో విమాన సర్వీసులు అందిస్తూ ఉండటంతో ఇక్కడి నుంచి వెళ్లే వారికి ఎంతో అనుకూలంగా ఉండేది. ఖర్చు తక్కువ అయ్యేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

Also Read: Union Minister in AP: నేడు ఏపీలో ఇద్దరు కేంద్రమంత్రుల పర్యటన

అక్టోబర్ 01, 2023 నుంచి భారత్ కు తమ విమాన సర్వీసులను ఆపేస్తున్నట్లు సలామ్ ఎయిర్ లైన్స్ తెలిపింది.  భారతదేశానికి విమాన సర్వీసుల కేటాయింపు పరిమితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం తప్పడం లేదంటూ పేర్కొంటూ ఇప్పటికే టికెట్లు కొన్న తమ ప్రయాణీకులకు ఈ మెయిల్స్ పంపించింది. అందులో “అక్టోబర్ 01, 2023 నుండి మేము మా విమాన సర్వీసులను ఇండియా నుంచి ఆపేస్తున్నా.  అలాగే ఒమన్ నుంచి ఇండియాకు వెళ్లే సర్వీసులను కూడా నిలిపివేస్తున్నాం.భారతదేశానికి విమాన సర్వీసుల కేటాయింపు పరిమితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాం. ఈ నిర్ణయం  అంత సులభంగా తీసుకున్నది కాదు. ఈ నిర్ణయం వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మమ్మల్ని క్షమించండి” అంటూ పేర్కొంది. ఇక ఇప్పటికే టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తిగా డబ్బులు వాపస్ చేస్తామని ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని పేర్కొంది. అయితే ఇలా సలామ్ విమాన సర్వీసులు ఆపడం మాత్రం భారతీయులకు షాక్ అనే చెప్పుకోవచ్చు.

Exit mobile version