NTV Telugu Site icon

Salaar OTT Release Date: అభిమానులకు శుభవార్త.. ‘సలార్‌’ ఓటీటీ డేట్‌ వచ్చేసింది!

Salaar Ott Release Date

Salaar Ott Release Date

Salaar Movie OTT Release Date Out: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ‘సలార్’. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరిరావు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వరుస ఫ్లాఫులతో సతమతమవుతున్న ప్రభాస్‌.. సలార్‌తో మంచి హిట్ అందుకున్నాడు. ఇక సలార్‌ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని వేచి చూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేసింది.

జనవరి 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో సలార్‌ సినిమా స్ట్రీమింగ్‌కు రానుంది. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి సలార్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్‌ కానుంది. విషయం తెలిసిన రెబల్‌స్టార్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా సలార్‌ స్ట్రీమింగ్‌కు వస్తుందని అనుకున్నా.. అంతకన్నా ముందే అభిమానులను నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజ్‌ చేసింది.

Also Read: Rohit Sharma: భారత జట్టు ఇంకా ఖరారు కాలేదు.. 8-10 మంది ఆటగాళ్లు మదిలో ఉన్నారు!

సలార్‌ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సలార్‌ సీక్వెల్‌ టైటిల్‌ను పార్ట్‌-1 చివర్లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్‌ చేశారు. మొదటి భాగాన్ని ‘సలార్‌-పార్ట్‌-1 సీజ్‌ఫైర్‌’ పేరుతో విడుదల చేయగా.. రెండో భాగానికి ‘సలార్‌-2 శౌర్యాంగపర్వం’ అనే పేరును ఖరారు చేశారు. బాహుబలి తర్వాత సలార్‌తో రెబల్‌స్టార్‌ భారీ హిట్‌ అందుకున్నాడు. పార్ట్‌-1 హిట్ కావడంతో పార్ట్‌-2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show comments