NTV Telugu Site icon

Salaar Movie Updates: సలార్ టీజర్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. అభిమానులకు పండగే ఇగ!

Salaar Movie

Salaar Movie

Prabhas, Prashanth Neel Movie Salaar Teaser Latest Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో శ్రుతి హాసన్‌ కథానాయిక కాగా.. జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సలార్ సినిమాను హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్‌ 28న పలు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, కేజీఎఫ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆకట్టుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్ కాంబో కాబట్టి సలార్ సినిమా నుంచి వచ్చిన చిన్న అప్డేట్ అయినా సరే నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. టీజర్ డేట్ ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు టీజర్ చూద్దామాని ఎదురుచూస్తున్నారు. తాజాగా సలార్ సినిమా టీజర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. గురువారం (జులై 6) తెల్లవారు జామున 5.12 నిమిషాలకు టీజర్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల్లో రిలీజ్ చేస్తున్నట్టు స్పష్టం అయింది. ఒక్కో దేశంలో ఒక్కో టైమ్‌కి టీజర్ రిలీజ్ అవుతుంది. ఆ వివరాలు ట్వీట్ ద్వారా తెలిపారు.

భారత్‌లో సలార్ టీజర్ జులై 6 తెల్లవారు జామున 5.12 నిమిషాలకు రిలీజ్ అవుతుంది. అమెరికాలో నేడు సాయంత్రం 4.42 నిమిషాలకు ముందుగా రిలీజ్ కానుంది. యూఏఈ, యూరప్, యూకే, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఆఫ్రికా, జపాన్, మలేసియా, సింగపూర్, నేపాల్ మరియు చైనాలో సలార్ టీజర్ విడుదల కానుంది. సలార్ టీజర్ డేట్ అనౌన్స్ అయిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో #SalaarTheSaga, #SalaarTeaser, #Prabhas హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

Also Read: Samantha Film Break: సమంత కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు దూరం?

Also Read: Zimbabwe CWC 2023: స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి.. ప్రపంచకప్‌ 2023కి జింబాబ్వే దూరం! రెండో బెర్తు ఎవరిదంటే

Show comments