రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ను మునుపెన్నడూ లేని పవర్‌ఫుల్ లుక్‌లో చూపించిన ఈ సినిమా రిలీజ్ అయి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్’ ముచ్చట్లను మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు. సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ‘సలార్-2’ (శౌర్యాంగ పర్వం) షూటింగ్ గురించి మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోవడంతో అభిమానులు కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం, ప్రశాంత్ నీల్ కూడా తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడంతో సీక్వెల్ ఎప్పుడనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే, సలార్-2 గురించి గతంలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు ధైర్యాన్నిస్తోంది.
Also Read : Shobhita pregnancy : చైతన్య తండ్రి కాబోతున్నాడన్న ప్రచారంపై నాగార్జున క్లారిటీ..!
“సలార్-2 నా కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమా అయ్యేలా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పటివరకు నేను రాసుకున్న స్క్రిప్ట్ లో ఇదే అత్యుత్తమమైనది. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో ఈ సీక్వెల్ ఉంటుంది” అని నీల్ భరోసా ఇచ్చారు. అంటే పార్ట్-1 కేవలం శాంపిల్ మాత్రమేనని, అసలు సిసలు యాక్షన్ పార్ట్-2లో ఉంటుందని ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు వంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాతలు సైలెంట్‌గా ఉన్నా, లోపల మాత్రం పని గట్టిగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది.
