NTV Telugu Site icon

Sakshi Vaidya : ఏజెంట్ భామకు బంపర్ ఆఫర్ వచ్చిందిగా..?

Whatsapp Image 2023 10 28 At 8.39.57 Pm

Whatsapp Image 2023 10 28 At 8.39.57 Pm

సినీ ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ కి అయినా కూడా రెండు, మూడు సినిమాలు ప్లాప్స్ వస్తే ఆ హీరోయిన్ ను దర్శక నిర్మాతలు అంతగా పట్టించుకోరు. కానీ కొందరి హీరోయిన్స్ కు మాత్రం ఫ్లాపులు ఎన్నొచ్చిన కూడా అవకాశాలు వరుసగా వస్తూ ఉంటాయి..అలాంటి హీరోయిన్స్ జాబితా కు చెందిందే బాంబే బ్యూటీ సాక్షీ వైద్య. ఏజెంట్ మూవీతో ఈ బ్యూటీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి సాక్షి అనుకోకుండా హీరోయిన్ అయింది.. దర్శకుడు సురేందర్ రెడ్డి, సాక్షీ వైద్య ఇన్‌స్టా రీల్స్‌ చూసి ఆమెను ఆడిషన్‌కు పిలిచాడట. కట్‌ చేస్తే అఖిల్‌ పక్కన హీరోయిన్‌గా ఆమెను ఫిక్స్ చేశారు. ఏజెంట్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సాక్షీకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే వరుణ్‌ తేజ్ గాండీవధారి అర్జున సినిమాలో చాన్స్ అందుకుంది.కానీ ఈ భామ టైం బ్యాడ్ అనుకుంటా ఈ సినిమా కూడా అల్ట్రా డిజాస్టర్‌గా మిగిలింది.

ఇక సాక్షీ కెరీర్‌ క్లోజ్ అయిపోయినట్లే.. టాలీవుడ్ కు ఈ భామ టాటా చెప్పేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ బ్యూటీకి ఓ క్రేజీ ఆఫర్ వరించింది. విజయ్‌ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి పాన్ ఇండియా సినిమాలో సాక్షీనే హీరోయిన్‌గా ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను తీసుకున్నా.. ప్రస్తుతం ఆమెకున్న బిజీ షెడ్యూల్‌లో డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయలేకపోయిందని సమాచారం. దాంతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక శ్రీలీల స్థానంలో సాక్షీ వైద్య తీసుకున్నట్లు సమాచారం… త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ మాఫియా, డ్రగ్స్‌తో కలకళం సృష్టిస్తున్న రౌడీ మూకలను అంతమొందించే పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సెకండ్ పార్ట్‌ను కూడా ప్లాన్‌ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అందుకోసం క్లైమాక్స్‌లో ఓపెన్‌ ఎండింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది… సితార ఎంటర్‌టైనమెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్డూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి..ఈ సినిమా హిట్ అయితే సాక్షి కి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తాయి..