Site icon NTV Telugu

Viral Video: ఎంఎస్ ధోనీ కాళ్లు మొక్కిన సాక్షి.. వీడియో వైరల్!

Sakshi Touches Dhoni Feet

Sakshi Touches Dhoni Feet

Sakshi Dhoni Took blessings from MS Dhoni: ప్రపంచ గొప్ప కెప్టెన్‌లలో ఒక‌డైన ఎంఎస్ ధోనీ.. ఆదివారం (జులై 7) త‌న 43వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మహీకి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ధోనీకి నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు ఉదయం నుంచే సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు. ధోనీ డై హార్డ్ ఫాన్స్ అయితే భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. మరికొందరు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మహీ పుట్టిన రోజు సందర్భంగా అతడి భార్య సాక్షి ధోనీ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

తన భర్త ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా సాక్షి ఇంట్లోనే భారీ ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి సమయంలో బర్త్‌డే కేక్‌ను ధోనీతో కట్‌ చేయించారు. కేక్‌ కట్‌ చేసిన మహీ.. తన సతీమణికి తినిపించారు. సాక్షి కూడా ధోనీకి కేక్ తినిపించి.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ధోనీ కాళ్లకు సాక్షి నమస్కరించారు. ఈ సమయంలో మిస్టర్​ కూల్​ నవ్వులు పూయించాడు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: MS Dhoni Hairstyle: ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ఆమె కోసమే కట్ చేయించాడు!

ఎంఎస్ ధోనీ, సాక్షిల వివాహం 2010 జులై 4న జరిగింది. ధోనీ దంపతులకు 2015 ఫిబ్రవరి 6న కూతురు జీవా జన్మించింది. ధోనీ సోషల్ మీడియా ఖాతాలను ఎక్కువగా ఉపయోగించడు అన్న విషయం తెలిసిందే. మహీకి సంబందించిన విషయాలను సాక్షి షేర్ చేసుకుంటుంటారు. 16 ఏళ్ల కెరీర్‌లో నాయకుడిగా, ఆటగాడిగా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ధోనీ.. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Exit mobile version