Site icon NTV Telugu

Sakini Ramachandraiah : పద్మశ్రీ సకిని రామచంద్రయ్య అనారోగ్యంతో మృతి

Sakini Ramachandraiah

Sakini Ramachandraiah

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాయ్ కూనవరం. ప్రాంతానికి చెందిన సకిని రామచంద్రయ్య అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు కోయ వర్గానికి చెందిన సకిని రామచంద్రయ్య మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మని తన మేళంతో ప్రచారాన్ని కొనసాగించేవాడు తన 15 గిరిజన భాషలో మేళతాళాలు వాయిస్తూ ఉండి వ్యక్తి రామచంద్రయ్య ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోయంక సకిన రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డుని అందించారు కాగా రామచంద్రయ్యకు తెలంగాణ ప్రభుత్వం కూడా కోటి రూపాయల నజరానా ఇంటి స్థలాన్ని ప్రకటించింది గత కొన్ని రోజులుగా రామచంద్రయ్య అనారోగ్యంతో ఉన్నారు కొద్దిసేపటి క్రితం రామచంద్రయ్య మృతి చెందినట్లు కొడుకు తెలిపారు.

కోయ తెగల చరిత్రను, విశిష్టతను గానం చేస్తూ, కోయ సంస్కృతి – సంప్రదాయాలను కాపాడుతున్న రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది.. తద్వారా మారుమూల అటవీప్రాంతాల్లో ప్రదర్శించే అరుదైన కళాకారుడికి, దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. డోలి కులస్థులు భద్రాచలం, ఏటూరునాగారం, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కోయ తెగల వంశ చరిత్రను చెప్పే ఏకైక కళాకారుడు రామచంద్రయ్యే.

Exit mobile version